యాంకర్ అనసూయ( Anchor Anasuya ).ఇప్పుడు ఈ పేరును చెరిపివేయాలని అమ్మడు విశ్వప్రయత్నాలు చేస్తుంది.
బుల్లితెరపై హాట్ యాంకర్ గా రాణించి వరుసగా ఆఫర్స్ అందుకుని స్టార్ యాంకర్ గా మారిపోయిన అనసూయ ఇప్పుడు యాంకరింగ్ ను మొత్తానికే మానేసింది.యాంకర్ గా రాణిస్తూనే ఒకప్పుడు మంచి మంచి సినిమాలు చేసిన ఈ బ్యూటీ నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది.
ముఖ్యంగా ఈమె రంగస్థలం సినిమాలో( Rangasthalam Movie ) రంగమత్తగా మెరిసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.సుక్కు ఈమె పాత్రను బాగా తీర్చి దిద్దడంతో అనసూయ నటిగా కూడా రాణిస్తుంది.అప్పటి నుండి పలు సినిమాల్లో నటించి మెప్పించింది.ఇక పుష్ప పార్ట్ 1( Pushpa Part 1 ) లో మంచి పాత్రలో మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడు పార్ట్ 2 లో కూడా నటిస్తూ బిజీగా ఉంది.
పుష్ప సినిమా తర్వాత అమ్మడికి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు రావడంతో యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి బిగ్ స్క్రీన్ మీద అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది.ఇదిలా ఉండగా ఈమె కొద్దీ రోజుల క్రితం తన భర్త, పిల్లలతో విదేశాలకు వెకేషన్ కోసం వెళ్ళింది.
అలాగే తన పెళ్లి రోజు జూన్ 4న కావడంతో అక్కడే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.
అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసి గత నాలుగు రోజులుగా ఈమె సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.ఏకంగా పెళ్లి రోజు బికినీలో దర్శనం ఇచ్చి షాక్ ఇచ్చింది.ఈ రేంజ్ లో అందాల ఆరబోత చూసి అంతా నోరెళ్లబెట్టారు.
ఇదిలా ఉండగా అనసూయ తాజాగా తమ పెళ్లి రోజు సందర్భంగా అప్పటి పెళ్లి ఫోటోలను షేర్ చేసింది.
నవ వధువుగా ఉన్న అనసూయ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పెళ్లి కూతురుగా ముఖంలో కళ, కొద్దిగా సిగ్గు కలబోసి టోటల్ గా అమ్మడు ఈ ఫొటోలతో ఆకట్టుకుంది.మరి మీరు కూడా ఈ పిక్స్ పై ఓ లుక్కేయండి.