చందుర్తి మండలంలోని వివిధ గ్రామాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి మహా ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సిరికొండ ప్రేమలతో శ్రీనివాస్,గట్టు లక్ష్మీనారాయణ, ఎంపీటీసీలు పులి రేణుక, సత్యం, వైస్ ఎంపీపీ మాందాల అబ్రహం,నాయకులు యువకులు, అంబేద్కర్ యువజన సంఘాలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని అమ్మి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..

Latest Rajanna Sircilla News