'జవాన్' ఓటిటి హక్కుల కోసం అమెజాన్ భారీ ఆఫర్.. మరి ఒప్పుకునేనా?

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కు ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాలీవుడ్ బాద్షాగా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించు కున్నాడు.

 Amazon Offers A Shocking Amount For Srk's Jawan, Shah Rukh Khan, Deepika Padukon-TeluguStop.com

ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాలు చేసిన ఈయనకు ఇప్పుడు మాత్రం అస్సలు కలిసి రావడం లేదు అనే చెప్పాలి.ఎందుకంటే గత పదేళ్లుగా ఒక్కటంటే ఒక్క హిట్ కూడా అందుకోలేదు.

అయినా కూడా ఈయన తాజా సినిమాకు భారీ బిజినెస్ జరుగుతుంది.

అన్నేళ్లు హిట్ అనే మాట లేకపోయినా ఈయన సినిమాకు అంత బిజినెస్ జరగడం చర్చనీయాంశం అయ్యింది.

షారుఖ్ ఖాన్ ప్రెసెంట్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు.ఈయన నటిస్తున్న సినిమాల్లో జవాన్ ఒకటి.

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది.

Telugu Amazonoffers, Amazon Prime, Jawan, Kollywood Atlee, Nayanthara, Shah Rukh

ఈ సినిమాతో నయనతార బాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది.అలాగే దీపికా పదుకొనే కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలో మెరవనుంది.దీంతో ఈ సినిమాపై బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా నుండి ఎప్పుడు ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది.మరి తాజాగా ఈ సినిమా బిజినెస్ గురించి మరొక వార్త వైరల్ అయ్యింది.

Telugu Amazonoffers, Amazon Prime, Jawan, Kollywood Atlee, Nayanthara, Shah Rukh

షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఓటిటి హక్కులను పొందేందుకు ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నట్టు టాక్.తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి ఓటిటి హక్కులను పొందేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ఆఫర్ చేసిందట.దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగానే ఈ సినిమాకు ఆఫర్ చేసినట్టు టాక్.మరి ఈ ఆఫర్ ను జవాన్ ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube