'జవాన్' ఓటిటి హక్కుల కోసం అమెజాన్ భారీ ఆఫర్.. మరి ఒప్పుకునేనా?
TeluguStop.com
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కు ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
బాలీవుడ్ బాద్షాగా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించు కున్నాడు.ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాలు చేసిన ఈయనకు ఇప్పుడు మాత్రం అస్సలు కలిసి రావడం లేదు అనే చెప్పాలి.
ఎందుకంటే గత పదేళ్లుగా ఒక్కటంటే ఒక్క హిట్ కూడా అందుకోలేదు.అయినా కూడా ఈయన తాజా సినిమాకు భారీ బిజినెస్ జరుగుతుంది.
అన్నేళ్లు హిట్ అనే మాట లేకపోయినా ఈయన సినిమాకు అంత బిజినెస్ జరగడం చర్చనీయాంశం అయ్యింది.
షారుఖ్ ఖాన్ ప్రెసెంట్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు.ఈయన నటిస్తున్న సినిమాల్లో జవాన్ ఒకటి.
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది. """/"/
ఈ సినిమాతో నయనతార బాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది.
అలాగే దీపికా పదుకొనే కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలో మెరవనుంది.దీంతో ఈ సినిమాపై బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమా నుండి ఎప్పుడు ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది.
మరి తాజాగా ఈ సినిమా బిజినెస్ గురించి మరొక వార్త వైరల్ అయ్యింది.
"""/"/
షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఓటిటి హక్కులను పొందేందుకు ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నట్టు టాక్.
తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి ఓటిటి హక్కులను పొందేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ఆఫర్ చేసిందట.
దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగానే ఈ సినిమాకు ఆఫర్ చేసినట్టు టాక్.
మరి ఈ ఆఫర్ ను జవాన్ ఒప్పుకుంటుందో లేదో చూడాలి.
పుష్ప2 సాధించిన రికార్డును బ్రేక్ చేసే దమ్ముందా.. ఈ రికార్డ్స్ సులువు కాదంటూ?