Flax seeds : అవిసె గింజలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకున్నారంటే వెయిట్ లాస్ తో సహా మస్తు బెనిఫిట్స్!

అవిసె గింజలు( Flax seeds ) వీటి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.

ఇటీవల కాలంలో ఆరోగ్యానికి మంచిదని చాలామంది అవిసె గింజలను డైట్ లో చేర్చుకుంటున్నారు.

పోషకాలకు అవిసె గింజలు పవర్ హౌస్ లాంటివి.మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్, సెలీనియం, జింక్, ఫోలేట్, విటమిన్ బి, ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు అవిసె గింజల్లో నిండి ఉంటాయి.

ఆరోగ్యం విషయంలో ఇవి అద్భుతాన్ని సృష్టిస్తాయి.ముఖ్యంగా అవిసె గింజలను నీటిలో నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే మస్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

అందుకోసం ముందుగా ఒక గ్లాసు తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు వేసి వాటర్ తో రెండు సార్లు వాష్ చేసుకోవాలి.ఆపై గ్లాస్ నిండా వాటర్ పోసుకుని మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి.ఉదయాన్నే కాళీ కడుపుతో నానబెట్టుకున్న అవిసె గింజలను వాటర్ తో సహా తీసుకోవాలి.

Advertisement

అవిసె గింజల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.ఇది ఆకలి కోరికను అణిచివేస్తుంది.

అవిసె గింజలు అధిక బరువు మరియు ఊబకాయం ఉన్నవారిలో వెయిట్ లాస్ అవ్వ‌డాన్ని ప్రోత్సహిస్తాయి.

అలాగే మనలో చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు.అలాంటివారికి అవిసె గింజలు సహజ నివారణ గా పనిచేస్తాయి.అవిసె గింజలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే మలబద్ధకం( Constipation ) దూరమవుతుంది.

జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.మధుమేహం ఉన్నవారు అవిసె గింజలను డైట్ లో చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

అవిసె గింజ‌ల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.వాట‌ర్ లో నాన‌బెట్ట‌డం వ‌ల్ల అవి రెట్టింపు అవుతాయి.

Advertisement

కాబ‌ట్టి నానబెట్టిన అవిసె గింజలను రోజు ఉదయాన్నే తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.హార్ట్ ప్రాబ్లమ్స్ ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

అంతేకాకుండా నాన‌బెట్టిన అవిసె గింజ‌ల‌ను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది.

బోన్స్ స్ట్రాంగ్ గా మారుతాయి.కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు దూరం అవుతాయి.

మరియు నానబెట్టిన అవిసె గింజలు ఆరోగ్యమైన జుట్టు మరియు చర్మాన్ని సైతం ప్రోత్సహిస్తాయి.

తాజా వార్తలు