ఉల్లి తొక్కలను పారేస్తున్నారా.. జుట్టుకు ఇలా వాడితే బోలెడు లాభాలు!

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతినిత్యం ఉల్లిపాయలు(onion) వాడుతుంటారు.ఎందుకంటే ఉల్లి లేనిదే ఏ కూర చేయలేరు.

చేసినా అందులో ఉల్లి లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది.ఇకపోతే ఉల్లిపాయలను తరిగే క్రమంలో తొక్క తీసి డస్ట్ బిన్ లోకి తోసేసే అలవాటు అందరికీ ఉంటుంది.

ఉల్లి తొక్కలు ఎందుకు పనికి రావని భావిస్తుంటారు.కానీ అది చాలా పొరపాటు.

నిజానికి ఉల్లి తొక్కలతో (onion peel)ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా కురుల సంరక్షణకు ఉల్లితొక్కలు అద్భుతంగా తోడ్పడతాయి.

Advertisement

బోలెడు లాభాలను చేకూరుస్తాయి.మరి ఇంతకీ జుట్టుకు ఉల్లి తొక్కలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా రెండు లేదా మూడు ఉల్లిపాయలు తీసుకుని తొక్క తీసి పెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక కలబంద ఆకుని వాటర్ తో శుభ్రంగా అక్కడికి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక ఉల్లిపాయ తొక్కలు(onion peel) మరియు కలబంద(Aloe vera ) ముక్కలు వేసుకోవాలి.ఈ రెండిటితో పాటు ఐదు నుంచి ఆరు లవంగాలు కూడా వేసి చిన్న మంట‌పై దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.గోరువెచ్చగా అయిన అనంత‌రం ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె (Mustard oil )వేసి బాగా మిక్స్ చేసి స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించాలి.గంట అయ్యాక తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వీడియో వైరల్ : నడిరోడ్డుపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని చితకబాదిన యువతులు..
30 ఏళ్ల క్రితమే కార్టూన్ తో ఆడి పాడిన రజినీకాంత్

వారానికి ఒకసారి ఈ విధంగా చేశారంటే జుట్టు రాలడం చాలా వేగంగా కంట్రోల్ అవుతుంది.చిట్లిన జుట్టు రిపేర్ అవుతుంది.హెయిర్ డ్యామేజ్ సమస్య అదుపులోకి వస్తుంది.

Advertisement

అలాగే ఉల్లి తొక్కలు, కలబంద, లవంగాలు చుండ్రును(dandruff) మొత్తం తొలగిస్తాయి.స్కాల్ప్ ను ఆరోగ్యంగా మారుస్తాయి.అంతేకాదు పైన చెప్పుకున్న రెమెడీని ఫాలో అయితే జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.

సిల్కీ గా మారుతుంది.కాబ‌ట్టి, ఆరోగ్యమైన ఒత్తైన దృఢమైన కురుల కోసం ఉల్లి తొక్కలతో పైన చెప్పుకున్న రెమెడీని తప్పకుండా ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.

తాజా వార్తలు