బిగ్ బాస్ 7 అంటే గుర్తొచ్చేది అమర్ దీప్ మాత్రమేనా..? ఇలాంటి ఫ్యాన్స్ ఏ కంటెస్టెంట్ కి ఉండరేమో!

ఈ సీజన్ బిగ్ బాస్ షో( Bigg Boss Show ) ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

అద్భుతమైన టాస్కులతో ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే మధ్య మధ్య లో కొన్ని ఎమోషన్స్ ఈ సీజన్ లో పండినట్టుగా ఏ సీజన్ లో పండలేదనే చెప్పాలి.

అయితే ప్రతీ సీజన్ కి ఒక కంటెస్టెంట్ మెయిన్ పిల్లర్ లాగ నిలుస్తాడు.అలాంటి కంటెస్టెంట్ ఈ సీజన్ లో ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు అమర్ దీప్.

( Amar Deep ) ఈ సీజన్ లో ఇతను పంచినంత ఎంటర్టైన్మెంట్ ఎవరూ పంచలేదనే చెప్పాలి.షో కి కావాల్సినంత కంటెంట్ అమర్ దీప్ నుండే వస్తుండడం తో, ఎక్కువ ఫోకస్ బిగ్ బాస్ టీం కూడా అతని వైపే పెట్టింది.

ప్రతీ ప్రోమో లో కూడా కచ్చితంగా అమర్ దీప్( Amar Deep) ఉండాల్సిందే.ప్రతీ ఎపిసోడ్ లో ఆయన కంటెంట్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టేవాడు బిగ్ బాస్.

Amardeep Is The Only One Who Remembers Bigg Boss 7 Which Contestant Does Not Hav
Advertisement
Amardeep Is The Only One Who Remembers Bigg Boss 7 Which Contestant Does Not Hav

అంతే కాదు ఈ సీజన్ లో ఎలాంటి ఫిల్టర్ లేకుండా చాలా జెన్యూన్ గా ఆడిన కంటెస్టెంట్ కూడా అతనే.తాను 83 కెమెరాల మధ్యలో ఉన్నాను అనే విషయం కూడా మర్చిపోయి తాను ఎలా అయితే ఉండాలి అనుకున్నాడో అలాగే ఉన్నాడు.సీజన్ ముగిసే సమయం లో కూడా ఆయన తన నిజమైన ఎమోషన్స్ ని ఆపుకునే ప్రయత్నం చెయ్యలేదు.

కోపం వస్తే కోపం చూపించాడు, బాధ వస్తే బాధ చూపించాడు.సాధారణంగా చివరి స్టేజి లో కోపం చూపించేందుకు కంటెస్టెంట్స్ ఇష్టపడరు.ఎందుకంటే తమ ఓటింగ్ మీద అది ప్రభావం చూపించే అవకాశం ఉందని.

కానీ గత వారం లో అమర్ దీప్ ప్రశాంత్ తో ( , Pallavi prashanth )గొడవ పడే సందర్భం వచ్చినప్పుడు ఇవన్నీ ఆలోచించకుండా గొడవ పడ్డాడు.ఈ సంఘటన వల్ల అతని గ్రాఫ్ మీద కాస్త ప్రభావం చూపించిన విషయం వాస్తవమే.

Amardeep Is The Only One Who Remembers Bigg Boss 7 Which Contestant Does Not Hav

నిన్న అమర్ కి సంబంధించిన ప్రత్యేకమైన వీడియో ని స్పెషల్ ఎఫెక్ట్స్ తో బిగ్ బాస్ లో వేశారు.ఈ వీడియో కి ఆయన ఫ్యాన్స్ నుండి మాత్రమే కాకుండా, ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.మొదటి 5 వారాల్లో అమర్ మీద జరిగినటువంటి నెగటివిటీ బిగ్ బాస్ చరిత్ర లో ఎవరి మీద కూడా జరగలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఆ పరిస్థితి లో ఏ కంటెస్టెంట్ అయినా బాగా డౌన్ అయిపోతాడు.కానీ అమర్ దీప్( Amar Deep ) మాత్రం రెట్టింపు ఉత్సాహం తో తన తప్పులను సరిదిద్దుకుంటూ ఈరోజు టైటిల్ రేస్ లో నిలిచాడు.

Advertisement

అమర్ దీప్ ప్రయాణం లో ఆయన ఫ్యాన్స్ పాత్ర ఎంతో ముఖ్యమైనది.మధ్యలో ఎన్నో సంఘటనలు జరిగినప్పటికీ ఆయన్ని వదలకుండా ఓట్లు వేస్తూ వచ్చారు.ఇలాంటి ఫ్యాన్స్ ఈ సీజన్ లో ఏ కంటెస్టెంట్ కి కూడా లేదనే చెప్పొచ్చు.

తాజా వార్తలు