యూఎస్ అధ్యక్ష ఎన్నికలు .. రిపబ్లికన్లలో ట్రంప్ దూకుడు, దరిదాపుల్లో లేని మరో నేత : రాయిటర్స్ ఓపీనియన్ పోల్

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రిపబ్లికన్ పార్టీ( Republican Party ) నామినేషన్ కోసం పోటీపడుతున్న వారిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు.రిపబ్లికన్ ఓటర్లలో సగానికి పైగా మంది మద్ధతును ఆయన పొందారు.సోమవారం నాటి రాయిటర్స్ ఇప్సోస్ ఓపీనియన్ పోల్ ప్రకారం .2024 రిపబ్లిన్ ప్రెసిడెంట్ నామినేటింగ్ పోటీలోత డొనాల్డ్ ట్రంప్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.61 శాతం మంది స్వీయ గుర్తింపు పొందిన రిపబ్లికన్‌లు డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ జో బైడెన్‌ను( President Joe Biden ) ఎదుర్కోవడానికి ట్రంప్‌కు తమ ఓటు వేస్తామని చెప్పారు.

 Trump Holds Wide Lead In Republican 2024 Nominating Contest Opinion Poll Details-TeluguStop.com
Telugu Chris Christie, Donald Trump, Joe Biden, Nikki Haley, Reutersipsos, Ron D

ఈ సర్వే ప్రకారం ట్రంప్‌ దారిదపుల్లో మరో రిపబ్లికన్ నేత ఎవరూ లేరు.ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్,( Ron Desantis ) మాజీ సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీలకు( Nikki Haley ) విడివిడిగా 11 శాతం మంది రిపబ్లికన్లు మద్ధతు పలికారు.పారిశ్రామికవేత్త , భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామికి( Vivek Ramaswamy ) 5 శాతం , న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీకి( Chris Christie ) 2 శాతం మంది అండగా నిలిచారు.2024 అధ్యక్ష ఎన్నికల్లో తొలి పోలింగ్ జనవరి 15న అయోవా రిపబ్లికన్ కాకస్‌లో నిర్వహించనున్నారు.ట్రంప్ ఎదుర్కొంటున్న ఫెడరల్, స్టేట్ నేరారోపణల కారణంగానే రిపబ్లికన్ ఓటర్లు ఆయన వైపు చూస్తున్నారన్న దానికి పోల్‌లో తక్కువ ఆధారాలు లభించాయి.

Telugu Chris Christie, Donald Trump, Joe Biden, Nikki Haley, Reutersipsos, Ron D

జనవరి 6, 2021న యూఎస్ క్యాపిటల్‌పై( US Capitol ) దాడి చేయడానికి ట్రంప్ తన మద్ధతుదారులను అభ్యర్ధించినట్లుగా వస్తోన్న ఆరోపణలను తాము విశ్వసిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న నాలుగింట ఒక వంతు మంది మాత్రమే చెప్పారు.ఇదే సమయంలో ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్ ఓటర్లు ఆయన ప్రత్యర్ధుల్లో ఒకరికి తమ మద్ధతు తెలియజేస్తారని రాయిటర్స్ సర్వే తెలిపింది.నిక్కీ హేలీ ఈ ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని సెప్టెంబర్‌తో పోల్చితే మెరుగుపరుచుకున్నారు.1689 మంది స్వీయ గుర్తింపు పొందిన రిపబ్లికన్ పార్టీకి చెందిన ఓటర్లతో డిసెంబర్ 5 నుంచి 11 మధ్య ఈ సర్వే నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube