అమరావతి పెద్ద భూదందా అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.ఐటీ నోటీసులు ఇచ్చిన రూ.118 కోట్లకు టీడీపీ అధినేత చంద్రబాబు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.
దుబాయ్ లో కూడా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని ఆరోపించిన మాజీ మంత్రి అనిల్ ఐటీ నాలుగు నోటీసులు ఇచ్చినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
అదేవిధంగా చంద్రబాబు ముడుపుల వ్యవహారంపై దత్తపుత్రుడు పవన్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.చంద్రబాబును ప్రజలు నమ్మరని, ఈ క్రమంలోనే మరోసారి వైఎస్ జగన్ ను సీఎం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ సిద్ధమని స్పష్టం చేశారు.