వైకాపాకు భారీ డ్యామేజీ చేస్తూనే ఉన్న ఆ ప్రాంత రైతులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తీరు పై అమరావతి ప్రాంత రైతులు( Amaravati Farmers ) మరో సారి కోర్టును ఆశ్రయించారు.రాజధాని ప్రాంతం లో నిర్మాణాలు జరగాలని.

 Amaravathi Farmers Went To Court Again Details, Amaravati, Chandrababu, Tdp, Ysr-TeluguStop.com

ఇప్పటికే ప్రారంభం అయ్యి మధ్య లో ఉన్న కట్టడాలను పూర్తి చేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోవడం లేదంటూ అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారు.ఎన్నికలు మరో సంవత్సరం సమయం మాత్రమే ఉంది.

ఈ సమయం లో వైకాపా ని( YCP ) అమరావతి ప్రాంత రైతులు పదే పదే ఇలాంటి కోర్టు కేసు లతో మీడియా సమావేశాలతో పాద యాత్ర లతో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.

Telugu Amaravathi, Ap, Chandra Babu, Cmjagan, Ysrcp-Politics

అమరావతి ప్రాంత రైతులు మాత్రమే కాకుండా ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాలకు చెందిన కొందరు కూడా రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు.వారంతా కూడా ఎన్నికల సమయం లో వైకాపా కు వ్యతిరేకంగా ఓటు వేసే ప్రమాదం ఉందంటూ అధికార పార్టీ నాయకులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అందుకే ఇప్పటికే రాజధాని ప్రాంత రైతులు వైకాపా తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు అనే విషయం ప్రచారం జరుగుతుంది.

Telugu Amaravathi, Ap, Chandra Babu, Cmjagan, Ysrcp-Politics

ఇక రాజధాని విషయం కారణం గా జగన్ ప్రభుత్వం( CM Jagan ) జాతీయ స్థాయిలో చాలా వీక్ అయింది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే ముందు ముందు జరగబోయే అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికల్లో రాజధాని విషయం చాలా తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది.అదే కనుక జరిగితే రాజధాని ప్రాంత రైతులు వైకాపా కి భారీ డ్యామేజ్ చేయడం ఖాయం అన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజధాని ప్రాంత రైతులను సైలెంట్ చేయడం కోసం జగన్ ప్రభుత్వం ఏమైనా ప్రకటనలు చేస్తుందా అనేది చూడాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube