ఎన్నికల ముందు అమరావతి రైతుల హంగామా.. వైకాపాకి నష్టం

2019 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వైపాకా కు కచ్చితంగా రాజధాని ఇష్యూ పెద్ద ఎత్తున డ్యామేజీ క్రియేట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.కొన్ని చోట్ల రాజధాని పై తీసుకున్న నిర్ణయం కారణంగా అనుకూల ఫలితాలు వస్తాయేమో కానీ ఎక్కువ శాతం మందికి మాత్రం వైకాపా ప్రభుత్వం రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయాలు అస్సలు నచ్చడం లేదట.

 Amaravathi Farmers Troubling For Ys Jagan Mohan Reddy Government  , Ys Jagan Moh-TeluguStop.com

రాయలసీమ కి కూడా అమరావతి విషయంలో జగన్‌ ప్రభుత్వం పై కోపం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఏపీ రాజధానిగా అమరావతి( Amaravathi ) అద్భుతమైన కట్టడాలతో హైదరాబాద్ రేంజ్ లో అభివృద్ది లో దూసుకు పోతూ ఉండేది అంటూ ఆ ప్రాంత రైతుల మరియు ప్రజల యొక్క అభిప్రాయం.

కానీ వైజాగ్ లో రాజధాని అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం( Y.S.Jagan Mohan Reddy ) అమరావతిలో మొత్తం నిర్మాణాలను ఆపేయడం జరిగింది.అక్కడ పిచ్చి చెట్లు మొలిచి కోట్ల రూపాయలు వృదా అవుతున్నాయి.

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఇది కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Amaravathi, Ap, Chandra Babu, Farmers, Visakhapatnam, Ysjagana-Politics

అమరావతి రైతులు గత మూడు నాలుగు సంవత్సరాలుగా కూడా జగన్‌ రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో ఎన్నికల సంవత్సరం రాబోతున్న కారణంగా మరింతగా ఆందోళనలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.రాజధాని ప్రాంత రైతులు మరియు ప్రజలు ఈ ఏడాది చివరి నుంచి కూడా వైకాపా యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేసే అవకాశాలు ఉన్నాయి.

Telugu Amaravathi, Ap, Chandra Babu, Farmers, Visakhapatnam, Ysjagana-Politics

అయినా కూడా అమరావతి విషయంలో జగన్ మోహన్ రెడ్డి తగ్గేది లేదు అంటూ దూసుకు పోతున్నారు.అంతే కాకుండా అమరావతి ప్రాంతంలో ఉన్న రాజధాని మొత్తంను కూడా వైజాగ్‌( Visakhapatnam ) కి ఎన్నికల ముందే తరలించేలా ప్లాన్ చేస్తున్నారు.మొత్తానికి వైకాపా ప్రభుత్వంకు వచ్చే ఎన్నికల సమయంలో అమరావతి ప్రాంత రైతులు మరియు ప్రజలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube