సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలకు( celebrities ) దర్శక నిర్మాతలతో, ఇతర నటీనటులతో కొన్ని రకాల రిలేషన్స్ ఉంటాయి.ఇక అవి సందర్భం బట్టి బయటపడుతూ ఉంటాయి.
ఇక మరి కొంతమంది ఆ రిలేషన్స్ గురించి చెప్పకుండా రహస్యంగా ఉంచుతారు.అందుకే చాలామంది నటీనటులకు దర్శక నిర్మాతల మధ్య రిలేషన్ ఉండటంతో వారికి సినిమాలలో పదేపదే అవకాశాలు వస్తూ ఉంటాయి.
అయితే ఇదంతా పక్కన పెడితే హీరోయిన్ ప్రియమణికి( Priyamani ) కూడా డైరెక్టర్ వెంకట్ ప్రభు తో ఒక రిలేషన్ ఉందని బయట పెట్టింది.అయితే ఆ రిలేషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కేరళ బ్యూటీ అయినా ప్రియమణి అచ్చం తెలుగు అమ్మాయిలాగా తెలుగు ప్రేక్షకులతో మంచి అభిమానం పెంచుకుంది.అప్పట్లో టాలీవుడ్ ( Tollywood )ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.తన నటనతో బాగానే గుర్తింపు అందుకుంది.తొలిసారిగా 2003 లో ఎవరే అతగాడు సినిమాతో పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.అదే సమయంలో తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.ఆ తర్వాత జగపతి బాబు నటించిన పెళ్లయిన కొత్తలో సినిమాలో నటించి ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది.
అలా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో నటించింది.కేవలం వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా బాధ్యత వహిస్తుంది.
ఈటీవీలో ప్రసారమవుతున్న రియాలిటీ షో ఢీ డాన్స్ షోలో( Dhi Dance Show ) జడ్జిగా కూడా చేసి బాగా సందడి చేసింది.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకుంది.
ఆ మధ్యనే వరుస సినిమాలలో సహాయక పాత్రలు చేసి మంచి గుర్తింపు అందుకుంది.

ఇక ప్రియమణి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.అప్పుడప్పుడు తన సినిమా అప్డేట్ ల గురించి కూడా పంచుకుంటూ ఉంటుంది.బాగా ఫోటోషూట్ లు కూడా చేయించుకుంటుంది.
చాలావరకు ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ ఉంటుంది.ఏ రోజు కూడా ఆమె అందాలు బయటపెట్టే విధంగా షో చేయలేదు.
కానీ ఈ మధ్య కాస్త అందాలను బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది.ఇక ప్రస్తుతం ఆమెకి కస్టడీ ( Custody )సినిమాలో నటించగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇక ఈ సినిమాకు డైరెక్టర్ వెంకట్ ప్రభు( Director Venkat Prabhu ) దర్శకత్వం వహించాడు.ఇందులో నాగచైతన్య హీరోగా నటించాడు.
అయితే ప్రమోషన్స్ భాగంలో ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకుంది.ఇక ఈ సినిమాలో ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో నటించింది.
తనకు ఈ పాత్ర ఇచ్చినందుకు డైరెక్టర్ వెంకట్ కి కృతజ్ఞతలు తెలిపింది.ఇక మొదట ఈ పాత్రలో మెల్ క్యారెక్టర్ ను తీసుకోవాలని అనుకున్నారని తనకు తెలిసిందని.
కానీ అందులో ఎంత నిజం ఉందో తెలియదు అని తెలిపింది.కానీ తనకు ఈ పాత్ర వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది.

ఇక డైరెక్టర్ వెంకట్ కు తనకు ముందు నుంచే పరిచయం ఉందని.కారణం వెంకట్ ప్రభు చెల్లి తన స్నేహితురాలు అని ఆ కనెక్షన్ ఎక్కువగా ఉంది అని తెలిపింది.అంతేకాకుండా తమిళ సినిమాల ద్వారా కూడా డైరెక్టర్ వెంకట్ తో కనెక్షన్ ఉందని తెలిపింది.ఇక ఆయన అంటే అభిమానం అని చెప్పుకొచ్చింది ప్రియమణి.







