పాకిస్థాన్ సుప్రీంకోర్టులో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఎదురు దెబ్బ తగిలింది.పీటీఐ దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది.
అయితే ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పీటీఐ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.కాగా అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేసు విచారణ నిమిత్తం ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ను పారా మిలటరీ రేంజర్స్ కోర్టు ఆవరణలోనే అరెస్ట్ చేశారు.
మరోవైపు ఇమ్రాన్ అరెస్ట్ కు నిరసనగా దేశ వ్యాప్తంగా పలు చోట్ల పీటీఐ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.







