Amala Paul :కుండలు తయారు చేస్తూ నేచురల్ లుక్ లో అదరగొడుతున్న అమలాపాల్.. ఫొటోస్ వైరల్?

హీరోయిన్ అమలాపాల్( Amala Paul ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Amala Paul Without Makeup Photos Are Going Viral On Social Media-TeluguStop.com

టాలీవుడ్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.తెలుగులో నాయక్, రఘువరుణ్ బీటెక్, ఇద్దరమ్మాయిలతో లాంటి సినిమాలలో నటించింది.

మొదట రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) నిర్మాణంలో హీరో నాగచైతన్య నటించిన బెజవాడ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత నటించిన సినిమాలతో ఈమె ఏకంగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది.అలాగే కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది.

ముఖ్యంగా ఆమె అనే సినిమా( Aame movie )లో న్యూడ్ గా నటించి అందరిని అవాక్ అయ్యేలా చేసింది అమలాపాల్.ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

అలాగే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి చేసిన రఘువరన్ బీటెక్, వీఐపీ 2 సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.ఈ రెండు సినిమాలతో ఈ ముద్దుగుమ్మ భారీగా ఆ పాపులారిటీని సంపాదించుకుంది.

ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఉన్నాయి.సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ముచ్చటిస్తూ ఉంటుంది.తరచూ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

ఆ ఫోటోలలో డీ గ్లామర్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది.కుండలు తయారు చేస్తూ పల్లెటూరి అమ్మాయిల కనిపిస్తూ అందాలను ఆరబోతూ డీ గ్లామర్ లుక్ లో కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ ముద్దుగుమ్మ నేచురల్ లుక్ పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.మేకప్ లేకున్నా అందంగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube