అమలా పాల్.ఈమె సౌత్ ప్రేక్షకులకు బాగా సుపరిచితం.
సౌత్ లో తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో పలు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అనిపించు కుంది.ఇక మన తెలుగులో ఈమె మెగా హీరోలతో సినిమాలు చేసి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుని ఆ తర్వాత తమిళ్ లో సినిమాలు చేస్తూ అక్కడే ఉండి పోయింది.
ఇటీవలే ఈమె కడవర్ అనే సినిమాను అమలా పాల్ ప్రొడక్షన్స్‘పేరుతో స్థాపించిన తన సొంత బ్యానర్ లో నిర్మించింది.క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టులో రిలీజ్ అయ్యింది.
ఇక ఇప్పుడు ఓటిటిలో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఈమె ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరో వైపు సినిమాలు నిర్మిస్తుంది.
ఇక ఈ క్రమంలోనే ఈమె తాజా ఇంటర్వ్యూలో తెలుగు పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈమె తెలుగులో సినిమాలు చేయక పోవడానికి కారణం ఏంటని అడుగగా ఈమె సంచలన కామెంట్స్ చేసింది.
తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ కేవలం లవ్ సాంగ్స్, సీన్స్ లో మాత్రమే ప్రిఫరెన్స్ ఉంటుంది అని తెలిపింది.

సినిమాలో కథకు ప్రాముఖ్యత ఇవ్వకుండా హీరోయిన్ గ్లామర్ మాత్రమే చూపిస్తారని.ఇక్కడ ఉన్న డిఫరెంట్ కల్చర్ కారణంగానే నేను సినిమాలు చేయలేదని.ఇంకా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కొన్ని కుటుంబాల చేతిలోనే ఉంటుంది అంటూ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది.
అయితే ఇప్పుడు కాలం మారింది అని తెలుగులో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నానంటూ తెలిపింది.