టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే.ఆదివారం మరణించడంతో సోమవారం మధ్యాహ్నం ఆయన ఫామ్ హౌస్ లో ఎంతోమంది అభిమానులు, బంధువులు కుటుంబ సభ్యుల ఆశ్రనయనాల నడుమ కృష్ణ రాజు గారి అంత్యక్రియలను ప్రభాస్ సోదరుడు చేతులమీదుగా జరిగాయి.
ఇక ఈయన మరణ వార్త తెలిసిన ఎంతోమంది సెలెబ్రెటీలు కృష్ణంరాజుతో తమకున్న అనుబంధం గురించి గుర్తుచేసుకొని బాధపడ్డారు.
ఈ క్రమంలోని కృష్ణంరాజు గారితో కలిసి పలు సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి జయప్రద కృష్ణంరాజు గారి మృతి పై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.
ఈ సందర్భంగా ఈమె కృష్ణంరాజు గారి మరణం పై స్పందిస్తూ.ఆయన నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా ఎంతో మంచి మనసున్న వ్యక్తిగా తన సినీ జీవితంలోనూ రాజకీయ జీవితంలోని ఏ విధమైనటువంటి మచ్చ లేకుండా మరణించిన రారాజు అంటూ తన గురించి గొప్పగా చెప్పారు.

ఇకపోతే కృష్ణంరాజు గారు ఎప్పుడు కనిపించిన ఏమ్మా జయప్రద ఎలా ఉన్నావు అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు.ఆ పిలుపు ఎప్పటికీ నా చెవులు మారుమోగుతూ ఉండేది.అయితే ప్రస్తుతం ఆయన లేరనే వార్త నమ్మశక్యంగా లేదని జయప్రద కృష్ణంరాజు గారితో ఉన్నటువంటి అనుబంధం గురించి గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు.కృష్ణంరాజు గారి లేని బాధ నుంచి బయట పడటం కోసం తన కుటుంబానికి ఆ భగవంతుడు శక్తి ప్రసాదించాలని ఈమె కోరుకున్నారు.







