దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారిలో నటి అమలాపాల్ ఒకరు.మైనా సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అనంతరం పలు తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడిపారు.18 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తన సినీ కెరియర్లో ఎన్నో బడిదుడుకులను ఎదుర్కొన్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమలాపాల్ మాట్లాడుతూ తాను సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి రాలేదని వెల్లడించారు.
నటనపై ఉన్న ఆసక్తితో అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన తనకు ఇక్కడ గైడెన్స్ ఇచ్చేవారు లేకపోవడంతో కెరియర్ ఆరంభంలోనే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు.అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వయసు పరిగణలోకి తీసుకోరనే విషయం అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలోనే తాను ఎంతో మంది సీనియర్ హీరోల సరసన నటించాల్సి వచ్చింది.ఇలా వయసు ఎక్కువగా ఉన్న హీరోలతో నటించే సమయంలో తాను ఎంతో ఒత్తిడికి గురయ్యానని ఆ సమయంలో అధిక ఒత్తిడితో నరకం అనుభవించానని ఈమె పేర్కొన్నారు.
![Telugu Amalapal, Kollywood, Love, Maina, Senior Heroes, Tollywood-Movie Telugu Amalapal, Kollywood, Love, Maina, Senior Heroes, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/08/amala-pal-shocking-experience-acting-with-senior-heroes-detailss.jpg )
ఇలా ఎంతోమంది సీనియర్ హీరోలతో నటించడం వల్ల తాను ఎన్నో తప్పులను తెలుసుకున్నానని, ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నానని ఈ సందర్భంగా ఈమె తెలిపారు.ఇలా నా ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులను ఎదుర్కొన్నందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకన్నా చిన్నవారికి తాను సలహాలు ఇస్తూ సరైన గైడెన్స్ ఇస్తున్నానని ఈమె తెలిపారు.ఇకపోతే అమలాపాల్ ఇదివరకే ఓ దర్శకుడితో ప్రేమలో పడి వివాహం చేసుకొని విడాకులతో విడిపోయిన విషయం మనకు తెలిసిందే.ఇలా విడాకుల తర్వాత ఈమె కెరియర్ పై ఫోకస్ చేసి వరుస సినిమాలలో నటిస్తున్నారు.