పుష్ప 2 కోసం అల్లు స్టూడియోలో భారీ మార్పులు.. భారీ సెట్ ప్లాన్ చేసిన సుకుమార్?

అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో నటించిన చిత్రం పుష్ప.గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

 Allu Studios Changes For Pushpa 2 Movie Know Details Inside , Allu Studios, Push-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని ఇంతకుమించి ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభించి దాదాపు షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించకపోవడంతో అల్లు అర్జున్ అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడానికి కారణం లేకపోలేదు.

పుష్ప సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడానికి ఓ కారణముంది.

ఈ సినిమాని సుకుమార్ బ్యాంకాక్ ఫారెస్ట్ ఏరియాలోను అలాగే కెన్యా పర్వతాల పైన ఈ సినిమా షూటింగ్ చేయాలని భావించారట.ఇలా సహజత్వంగా ఉండడం కోసం సుకుమార్ ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఆ దేశాల నుంచి సినిమా షూటింగ్ కి అనుమతి లేకపోవడం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైందని తెలుస్తుంది.

అయితే ఇందుకుగాను పర్మిషన్ లేకపోవడంతో చేసేదేమీ లేక సుకుమార్ ఫారెస్ట్, పర్వతాల సెట్ వేయడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం.

Telugu Allu Arjun, Allu Studios, Pushpa, Sukumar, Tollywood-Movie

ఇక ఈ సినిమా కోసం అల్లు స్టూడియోలో ఈ విధమైనటువంటి ఫారెస్ట్, కెన్యా పర్వతాలను తలపించేలా భారీ సెట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమా షూటింగ్ సెట్ కోసం అల్లు స్టూడియోలో పెద్ద ఎత్తున మార్పులు కూడా చేస్తున్నారని టాలీవుడ్ సమాచారం.ఇక ఈ సెట్ కోసం మేకర్స్ భారీగానే ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది.

మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube