పుష్ప 2 కోసం అల్లు స్టూడియోలో భారీ మార్పులు.. భారీ సెట్ ప్లాన్ చేసిన సుకుమార్?
TeluguStop.com
అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో నటించిన చిత్రం పుష్ప.
గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని ఇంతకుమించి ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభించి దాదాపు షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించకపోవడంతో అల్లు అర్జున్ అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడానికి కారణం లేకపోలేదు.పుష్ప సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడానికి ఓ కారణముంది.
ఈ సినిమాని సుకుమార్ బ్యాంకాక్ ఫారెస్ట్ ఏరియాలోను అలాగే కెన్యా పర్వతాల పైన ఈ సినిమా షూటింగ్ చేయాలని భావించారట.
ఇలా సహజత్వంగా ఉండడం కోసం సుకుమార్ ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఆ దేశాల నుంచి సినిమా షూటింగ్ కి అనుమతి లేకపోవడం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైందని తెలుస్తుంది.
అయితే ఇందుకుగాను పర్మిషన్ లేకపోవడంతో చేసేదేమీ లేక సుకుమార్ ఫారెస్ట్, పర్వతాల సెట్ వేయడానికి ప్లాన్ చేసినట్టు సమాచారం.
"""/"/
ఇక ఈ సినిమా కోసం అల్లు స్టూడియోలో ఈ విధమైనటువంటి ఫారెస్ట్, కెన్యా పర్వతాలను తలపించేలా భారీ సెట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ సెట్ కోసం అల్లు స్టూడియోలో పెద్ద ఎత్తున మార్పులు కూడా చేస్తున్నారని టాలీవుడ్ సమాచారం.
ఇక ఈ సెట్ కోసం మేకర్స్ భారీగానే ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది.మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు తీపికబురు.. వార్2 సినిమా నుంచి ఫస్ట్ లుక్ అప్పుడేనా?