టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్( Allu Arjun ) పిల్లలు అల్లు అయాన్ ( Allu Ayaan )అర్హ ( Arha ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరూ ఇంత చిన్న వయసులోనే ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
ఇక వీరికి సంబంధించిన అన్ని విషయాలను వీరి తల్లి స్నేహ రెడ్డి ( Sneha Reddy ) ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.దీంతో ఈ చిన్న పిల్లలకు ఇంత చిన్న వయసులోనే ఎంతో మంచి ప్రేక్షకాదరణ ఫాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.
ఇక ఎన్ని రోజులు అయాన్ సైలెంట్ గా ఉన్నప్పటికీ అల్లు అర్హ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సందడి చేసేవారు.కానీ ఇటీవల కాలంలో అయాన్ హంగామా భారీగా ఉంది.
బెర్లిన్ వేదికగా అల్లు అర్జున్ మోడల్ బోల్తే అంటూ అయాన్ గురించి చేసినటువంటి కామెంట్స్ ఒకసారిగా వైరల్ అయ్యాయి.ఇక అల్లు అర్జున్ ని సైతం ఇమిటేట్ చేస్తూ అయాన్ చేసినటువంటి వాకింగ్ స్టైల్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.
దీంతో ఒక్కసారిగా అయాన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.

ఇక ఇటీవల షారుఖ్ ఖాన్ పాటను హమ్ చేస్తూ ఉన్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఏకంగా షారుఖ్ ఖాన్ కూడా ఈ వీడియో పై స్పందించారు.దీంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్హ అయాన్ ఇద్దరు కూడా ఆరు బయట నులక మంచం పై పడుకొని ఎంచక్కా ఆకాశాన్ని చూస్తూ ప్రకృతిని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎందుకు సంబంధించినటువంటి ఫోటోలను స్నేహ రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.

అసలే ఎండలు కాలం మొదలైంది ఇంట్లో ఎంత ఏసీలు ఉన్నప్పటికీ చాలా వేడిగా ఉంటుంది.ఇలాంటి సమయంలో ఆరుబయట సాయంత్రం పూట మంచం వేసుకొని ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది.ఈ క్రమంలోనే అల్లు పిల్లలు కూడా ఆరు బయట మంచం పై పడుకొని ఆ చల్లగాలిని ఆస్వాదిస్తూ ఎంతో ఎంజాయ్ చేశారని తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కాబోతోంది.