రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్ లో నూతనంగా నెలకొల్పిన వస్ట్ర వ్యాపార సంస్థ “వల్లి సిల్క్స్” షోరూంను సినీ హీరో అల్లు శిరీష్, హీరోయిన్ నేహా శెట్టి, యాంకర్ అనసూయ గ్రాండ్ గా ప్రారంభించారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేహాశెట్టి, అనసూయ సందడి చేసి అభిమానులను అలరించారు.
తొలుత రిబ్బన్ కట్ చేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు.అనంతరం షోరూం అధినేత కల్యాణ్ తో కలిసి హీరో అల్లు శిరీష్, హీరోయిన్ నేహా శెట్టి, యాంకర్ అనసూయ మీడియాతో మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో పేరు గాంచిన రాజమండ్రిలో వల్లి సిల్క్స్ నూతన షోరూం వస్త్ర ప్రేమికుల మనసులు దోచుకుంటున్న ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజమండ్రి అంటే తనకు ఎంతో ఇష్టమని శిరీష్ చెప్పారు.
అనసూయ మాట్లాడుతూ రంగస్థలం సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతంలో జరిగిందని ఈ నగరం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు.తనకు చీరలు అంటే ఎంతో ఇష్టమని ఈ వల్లి సిల్క్స్ షోరూంలో చీరలు ఎంతో కలర్ ఫుల్ గా ఉన్నాయన్నారు.నేహాశెట్టి మాట్లాడుతూ వల్లి సిల్క్స్ షోరూం వారి ఇతర వస్త్ర వ్యాపార సంస్థలు కూడా దుస్తులకు, మన్నికకు పేరుగాంచాయని ఈ వల్లి సిల్క్స్ వస్త్రాలు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు.
షోరూం అధినేత కల్యాణ్ మాట్లాడుతూ తమ వస్త్ర సంస్థలు కళామందిర్, కె.ఎల్.ఎం., వరమహాలక్ష్మి, తదితర వాటిని ఆదరించినట్లు గానే ఇప్పుడు వల్లి సిల్క్స్ ను కూడా ఖాతాదారులు, రాజమండ్రి ప్రజలు ముఖ్యంగా మహిళలు ఎంతగానో ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.