Allu Ayaan : తండ్రిని ఇమిటేట్ చేస్తున్న అల్లు అయాన్… ఇంత టాలెంట్ ఉందా?

సాధారణంగా ప్రతి ఒక్క రంగంలోనూ వారసుల పరంపర కొనసాగుతూ ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే.ఇలా ఇండస్ట్రీలో కూడా వారసులు రావడం సర్వసాధారణంగా జరిగే అంశం.

 Allu Ayaan Imitate Allu Arjun Pushparaj Style-TeluguStop.com

ఇప్పటికే ఎంతోమంది సినీ వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇలా స్టార్ హీరోల పిల్లలు కూడా త్వరలోనే ఇండస్ట్రీలోకి రావడానికి ముందుగానే కర్చీఫ్ వేస్తున్నారు.

ఇలా ఇప్పటికే ఎంతోమంది సినీ వారసులు చిన్నప్పటినుంచి తమలో ఉన్నటువంటి టాలెంట్ బయట పెడుతూ అభిమానులను పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకుంటూ ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి అల్లు అర్జున్ మహేష్ బాబు వంటి పిల్లలు ఇప్పటికే సోషల్ మీడియాలో తమకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

ఇక ఈ స్టార్ కిడ్స్ చేసే అల్లరి మామూలుగా ఉండదు వీరి అల్లరికి సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ పిల్లలకు చిన్నప్పటి నుంచే సెలబ్రెటీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మహేష్ బాబు కుమార్తె సితార నటనలో ఎంతో టాలెంట్ కలిగి ఉంది ఎంతో అద్భుతంగా డాన్సులు కూడా చేస్తుంది.

ఇలా ఎప్పటికప్పుడు ఈమె తన డాన్సులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక అల్లు అర్జున్( Allu Arjun ) కుమార్తె అర్హ ( Arha ) ఇంత చిన్న వయసులోనే ఒక సినిమాలో బాలనటిగా నటించారు.

అంతేకాకుండా ఈమె చేసే అల్లరి పనులు ముద్దు ముద్దు మాటలకు సంబంధించిన వీడియోలను తన తండ్రి అల్లు అర్జున్ అలాగే తల్లి స్నేహ రెడ్డి( Sneha Reddy ) ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు.

ఈ విధంగా అర్హ ఇంత చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇకపోతే అల్లు అర్జున్ కుమారుడు అయాన్ ( Ayaan ) కూడా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు.ఈ బుడ్డోడు చేసే అల్లరి పనులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే తాజాగా అల్లు అయాన్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఒక భుజం పైకి లేపి కాస్త భిన్నంగా నడుస్తూ ఉంటారు.అయితే అల్లు అయాన్ సైతం తన తండ్రిని ఇమిటేట్ చేస్తూ అచ్చం తన తండ్రిలాగే ఒక భుజం పైకి లేపి అర్జున్ స్టైల్ లోనే నడుస్తూ వచ్చారు.ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం అయాన్ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube