బన్నీ లైనప్ లో మరో ఇద్దరు.. పుష్ప తర్వాత వీరితోనేనట!

టాలీవుడ్ స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన ప్రజెంట్ ఐకాన్ స్టార్ గా గ్లోబల్ వైడ్ గా వెలుగొందు తున్నాడు.

 Allu Arjuns Upcoming Line Up Update, Allu Arjun, Pushpa 2, Sukumar, Rahsmika Man-TeluguStop.com

ఒకే ఒక్క సినిమాతో ఇంతటి క్రేజ్ తెచ్చుకున్నాడు.అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ఆ వెంటనే సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేసాడు.

ఈ సినిమా ఒక్క పార్ట్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు రెండు పార్టులుగా తెరకెక్కనుంది.మొదటి పార్ట్ ఊహించని విజయం అందుకుని అల్లు అర్జున్ కు పాన్ ఇండియన్ స్టార్ డమ్ తెచ్చిపెట్టింది.

ప్రెజెంట్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ ను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ పని చేస్తుండగా.ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేయడానికి బాగా ట్రై చేస్తున్నారు.ఇదిలా ఉండగా నిన్న అల్లు అర్జున్ మరో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.నెక్స్ట్ సినిమాను బన్నీ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో అనౌన్స్ చేసాడు.

ఈ సినిమా ప్రకటన రాగానే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఇక ఇప్పుడు ఈయన లైనప్ లో మరో ఇద్దరు స్టార్ డైరెక్టర్లు ఉన్నారని టాక్ వస్తుంది.సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ కంటే ముందే ఈ ఇద్దరి డైరెక్టర్లలో ఒకరితో సినిమా చేయబోతున్నాడు అని తెలుస్తుంది.

మరి ఆ ఇద్దరు ఎవరంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా సురేందర్ రెడ్డి అని లేటెస్ట్ బజ్ ఒకటి వైరల్ అయ్యింది.మరి బన్నీ ఈ ఇద్దరిలో పుష్ప తర్వాత ఎవరితో సినిమా స్టార్ట్ చేస్తాడో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube