కాపీ వివాదంలో చిక్కుకున్న పుష్ప టీజర్.. అసలేమైందంటే..?

రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్, అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

అల్లు అర్జున్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా బన్నీ బర్త్ డే కానుకగా ఈ నెల 7వ తేదీన పుష్ప టీజర్ రిలీజైంది.

అయితే ఈ టీజర్ కాపీ వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.టీజర్ లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాపీ అని నెటిజన్లు దేవీ శ్రీ ప్రసాద్ ను ట్రోల్ చేస్తున్నారు.

కాపీ వివాదం వల్ల పుష్ప టీజర్ వార్తల్లో నిలుస్తోంది. హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ నుంచి పుష్ప బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను కాపీ కొట్టారని సమాచారం.మరి కొందరు నెటిజన్లు అవెంజర్స్, పుష్ప మ్యూజిక్ ఒకేలా ఉండటం యాదృచ్చికంగా జరిగిందని పాపం డీఎస్పీ అంటూ ట్విట్టర్ లో ట్వీట్స్ పెడుతున్నారు.ఈ కాపీ ఆరోపణలపై దేవీ శ్రీ ప్రసాద్ లేదా పుష్ప చిత్ర యూనిట్ స్పందించి వివరణ ఇస్తుందేమో చూడాల్సి ఉంది.9 లక్షల లైకులతో పాటు మూడు కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకున్న పుష్ప టీజర్ బాగానే ఉన్నా కాపీ ఆరోపణలు వైరల్ అవుతూ దేవీ శ్రీ ప్రసాద్ కు చెడ్డపేరు తెస్తున్నాయి.ఈ ఏడాది ఆగష్టు నెల 13వ తేదీన పుష్ప సినిమా రిలీజ్ కానుంది.

అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒక పాత్రలో లారీ డ్రైవర్ గా మరో పాత్రలో స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు.అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక ఈ సినిమాలో నటిస్తున్నారు.

Advertisement

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు