ఒకప్పుడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అంటే చాలా గొప్పగా ప్రతిష్టాత్మకంగా భావించే వారు.ఆ అవార్డు దక్కితే ఇక వారు గొప్పవారు.
వారిని గౌరవంగా భావించేవారు.కానీ ఇప్పుడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అయినా కూడా అస్సలు పట్టించుకు పరిస్థితులు లేవనే చెప్పాలి.
జనాలు కూడా ఈ అవార్డులను లైట్ తీసుకుంటున్నారా అనే అనుమానాలు సైతం వస్తున్నాయి.
ఇక రీసెంట్ గానే 2021 ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది.
దీనిలో అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా దాదాపు అన్ని విభాగాల్లో అవార్డులను అందుకుని తగ్గేదేలే అంటూ మరోసారి నిరూపించుకుంది.మరి అల్లు అర్జున్ కూడా ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
ఇందుకు అల్లు ఫ్యాన్స్ నుండి అభినందనలు వెల్లువెత్తాయి.
కానీ మెగా ఫ్యామిలీ నుండి మాత్రం ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డులపై స్పందించిన వారు లేరు.దీంతో మరోసారి మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.అయితే మరికొంత మంది మాత్రం మునుపటి మాదిరిగా ఇప్పుడు ఫిల్మ్ ఫేర్ అంటే క్రేజ్ లేకపోవడం వల్లనే మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కు స్పందించక పోయి ఉండవచ్చు అని చెబుతున్నారు.
మొత్తానికి బన్నీకి ఫిల్మ్ ఫేర్ వచ్చిన పెద్దగా చర్చ జరుగక పోవడం గమనార్హం.
అల్లు అర్జున్ హీరోగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది.ఇక ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో ఈసారి మరింత భారీ తారాగణం కనిపించ బోతున్నారు.