డెలివరీకి పిల్లలు రెడీ.. ఒకటి కొంటె మరొకటి ఫ్రీ.. అంత డిజైనర్ బేబీల కాలం ఇది !

ఒకప్పుడు భారతదేశంలో టెక్నాలజీ చాలా తక్కువగా ఉండేది.మహిళలో పురుడు పోసుకోవాలంటే కేవలం మంత్రసానులు మాత్రమే పురుడు పోసేవారు.

 Designer Babies Generation In Recent Days Details, Designer Babies, Nayanthara,-TeluguStop.com

వారికి తెలిసిన అర కోర వైద్యంతో బిడ్డను బయటకు తెచ్చేవారు.ఆ సమయంలోనే ఎక్కువగా బాలింత మరణాలు జరిగాయి.

నవజాత శిశు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండేది.ఇందులో మంత్రసానుల తప్పేమీ లేదు.

వారికి తెలిసిన వైద్యం వారు చేసేవారు.మన వైద్య సౌకర్యాలు అంతకుమించి ముందుకు తీసుకెళ్లలేకపోయాయి.

కానీ దేశం దినదినాభివృద్ధి చెందుతుంది.ఆ కాలం నుంచి హాస్పిటల్లో పురుడు పోసుకుని స్థాయికి మనవాళ్లు ఎదిగారు.

ఆ తర్వాత సమయాలు చూసుకొని, ముహూర్తాలు పెట్టుకొని సిజేరియన్ ఆపరేషన్ చేయించుకొని మరి బిడ్డలని బయట ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.ఎవరికి పురిటి నొప్పులు పడే ఓపిక లేదు, ఎదురుచూపులు అంతకన్నా అవసరం లేదు.

టైం వచ్చిందా అంతే కడుపుకోసేయడం, కుట్టేయడం, ప్రసవం అంటే లక్షల్లో ఖర్చు పెట్టేయడం.ఇది నిన్నా, మొన్నటి వరకు జరిగిన స్థితి మన పరిస్థితి.కానీ కాలం మరింత స్పీడ్ పెంచింది.అది మనిషి మేదస్తుకు సవాల్ విసిరుతోంది.

అందుకే నేటి కాలంలో డిజైనర్ బేబీలు కూడా బయటకు వచ్చారు.

ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డర్ ఇచ్చేస్తున్నారు.

పెళ్లి అయినా పేరంటమైన వారికి సంబంధం లేదు.అదిగో ఆర్డర్ ఇచ్చామా ? ఆన్లైన్లో డెలివరీ చేసామా.అన్నట్టుగా పిల్లలు భూమి మీదకు వచ్చేస్తున్న పరిస్థితి లు ఇవి.ప్రస్తుతం నయనతార విగ్నేష్ దంపతులు పెళ్లైన నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు బిడ్డలకు తల్లిదండ్రులుగా మారారు.వీరు బిడ్డలకు జన్మనిచ్చాం అని సోషల్ మీడియాలో పెట్టుకోగానే అసలైన యుద్ధం మొదలైంది.మన దేశంలో ప్రతి రాష్ట్రంలో ఫెర్టిలిటీ ఫ్యాక్టరీలు అవైలబుల్ ఉన్నాయి.ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ చేసినంత ఈజీగా పిల్లల్ని ఆర్డర్ చేస్తున్నారు.ఇక రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో ఏమో తెలియదు.

బిడ్డ పుట్టాల్సిన టైం, డేట్ తో సహా కలరు, హైటు, విడ్త్ కూడా కొలుచుకొని బిడ్డల్ని కనే పరిస్థితులు వస్తాయేమో అని కొందరు భయపడుతున్నారు.ఇటీవల కాలంలో ఓ సర్వే చెప్తున్న విషయం ఏంటి అంటే చాలామంది అమ్మాయిలు తమలోని అండాన్ని పెళ్లి కాకుండానే వీర్య దాతల నుంచి వీర్యాన్ని సేకరించి సరోగసి ద్వారా లేదంటే సొంతంగా నైనా సింగిల్ మదర్స్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు.అబ్బాయిలు తమ వీర్యంతో అండ దాతలతో ల్యాబ్ లో ఉత్పత్తి చేసి సింగిల్ ఫాదర్స్ గా ఉంటున్నారు.వీరికి పెళ్లి పెటాకులతో సంబంధం లేదు.ఇదండీ డిజైనర్ బేబీల కాలమంటే

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube