అల్లు అర్జున్ నటించిన ఈ రెండు పెద్ద సినిమాలు ఎందుకు ఆగిపోయాయి..?

మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో అల్లు వారి ఆశీస్సులతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) పరిచయమయ్యారు.

పుష్ప సినిమాతో( Pushpa ) తొలిసారిగా ఫ్యాన్ ఇండియా సినిమాని తెరకెక్కించి మరోసారి దాన్ని సీక్వెల్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అల్లు అర్జున్.

సూపర్ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా చెప్పుకోవచ్చు.గంగోత్రి సినిమాతో తొలిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి డైరెక్టర్ కి రాఘవేంద్రరావు చేతుల మీదుగా పరిచయమైన అల్లు అర్జున్ నేడు ఐకాన్ స్టార్ గా( Icon Star ) ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హీరోగా కొనసాగుతున్నారు.

అయితే ఇంత పెద్ద స్టార్ హీరో అనుకుంటే ఎలాంటి సినిమా అయినా తీయగలరు.పైగా ఇంట్లోనే గీత ఆర్ట్స్ బ్యానర్ కూడా ఉంది.

అయినా కూడా అల్లు అర్జున్ చేయవలసిన రెండు పెద్ద సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి.మరి ఆ రెండు సినిమాలు ఏంటి? ఎవరి కాంబినేషన్లో రావలిసి ఉండేది ఎందువల్ల ఆగిపోయాయి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.అల్లు అర్జున్ హీరోగా ఐకాన్( Icon ) అనే పేరుతో దిల్ రాజు( Dil Raju ) నిర్మాతగా ఓ చిత్రం అనౌన్స్ చేశారు.

Advertisement

దీనికి సంబంధించిన పోస్టర్స్ కూడా విడుదల చేశారు.కానీ కారణాలేంటో తెలియదు కానీ ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందో కూడా ఎవరికి తెలియదు.ఈ చిత్రానికి ఈ వకీల్ సాబ్ దర్శకుడైన వేణు శ్రీరామ్ దర్శకత్వం చేయాల్సి ఉండేది.

మరి భవిష్యత్తులో అయినా ఈ చిత్రం తెరకెక్కుతుందో లేదో తెలియాల్సిన అవసరం ఉంది.

ఇక కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో సైతం అల్లు అర్జున్ ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ అప్పటికే ఆచార్య సినిమా పరాజయం ఈ సినిమాపై పడడంతో వీళ్లిద్దరి కాంబినేషన్ లో రావాల్సిన చిత్రం ఆగిపోయింది.ఇదే స్టోరీ తో ప్రస్తుతం దేవర సినిమా( Devara ) తెరకెక్కుతుంది అని అందరూ అనుకుంటున్నారు.కారణాలు ఏమైనా అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్ హీరో చిత్రాలు కూడా ఇలా మధ్యలో ఆగిపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయం.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో చాలా బిజీగా ఉన్నారు.అతి త్వరలో ఈ చిత్రం ప్రేక్షకులో ముందు రావడానికి సిద్ధమవుతోంది.

పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Advertisement

తాజా వార్తలు