అల్లు అర్జున్‌ ఇష్క్‌ చేయనున్నాడా?

‘ఇష్క్‌’, ‘మనం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌.తమిళంలో ప్రస్తుతం ‘24’ అనే హర్రర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈ దర్శకుడు త్వరలో అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

 Allu Arjun To Teamup With Manam Director-TeluguStop.com

ఇప్పటికే అల్లు అర్జున్‌కు విక్రమ్‌ కథను కూడా వినిపించాడని త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న అల్లు అర్జున్‌ తర్వాత సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.

కాని తాజాగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో బన్నీ సినిమాకు రంగం సిద్దం అవుతుందంటూ మెగా సన్నిహితులు చెబుతున్నారు.మరో వైపు విక్రమ్‌ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘24’ సినిమాను మరో రెండు నెలల్లో పూర్తి చేసి వచ్చే సంవత్సరం ఆరంభంలో విడుదల చేయబోతున్నాడు.

ఆలోపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం విడుదల అయ్యే అవకాశాలున్నాయి.మరి అల్లు అర్జున్‌తో విక్రమ్‌ ‘ఇష్క్‌’లాంటి ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తాడో లేక ‘మనం’ మంటి వైవిధ్యభరిత చిత్రాన్ని రూపొందిస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube