అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో రూపొంది గత సంవత్సరం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే.అంతటి భారీ విజయాన్ని నమోదు చేసింది కనుక అంతకు మించి ఆ సినిమా యొక్క సీక్వెల్ ఉండాలి అనే ఉద్దేశం తో దర్శకుడు సుకుమార్ దాదాపు పది నెలల పాటు కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేశాడు.
ఎట్టకేలకు కథ సిద్ధం అవ్వడం తో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.నవంబర్ 7వ తారీకు నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయని నవంబర్ 9 వ తారీకు లేదా పదో తారీకు నుండి అల్లు అర్జున్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు అంటూ సమాచారం అందుతుంది.

ఇక ఈ సినిమా కోసం దర్శకుడు సుకుమార్ దాదాపుగా 95 రోజుల నుండి 100 రోజుల పాటు షూటింగ్ నిర్వహించబోతున్నాడని సమాచారం అందుతుంది.పక్కా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేశారు.కనుక సినిమా మరీ ఆలస్యం కాకుండా చకచకా పూర్తి చేసే ఉద్దేశం తో 100 రోజుల లోపే డేట్స్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.ఇప్పటికే ఆలస్యమైన సినిమా ను మరీ షూటింగ్ సమయం లో ఆలస్యం చేస్తే బడ్జెట్ భారీగా పెరుగుతుందని.
అందుకే మరింత ఆలస్యం చేయకుండా సినిమా ను వంద రోజుల్లో పూర్తి చేసి వచ్చే సంవత్సరం డిసెంబర్లో లేదా అంతకు ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు అంటూ సమాచారం అందుతుంది.ఇక పుష్ప 2 సినిమా లో కూడా రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతుంది.
బాలీవుడ్ కి చెందిన ప్రముఖ స్టార్స్ ఈ సీక్వెల్లో కనిపించబోతున్నారని సమాచారం అందుతుంది.మొత్తానికి పుష్ప 2 అంచనాలు భారీగా మూట కట్టుకొని రాబోతుంది.మరి ఆ స్థాయిలో దర్శకుడు సుకుమార్ ని రూపొందించగలడా లేదా అనేది చూడాలి.







