టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయిన “ఆహా” లో “సామ్ జామ్” అనే టాక్ షో ని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.మొదటి ఎపిసోడ్ కు విజయ్ దేవరకొండ వచ్చి అందరిని అలరించాడు.
పలువురు టాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ ఆహా కు గెస్ట్ గా వచ్చి సందడి చేశారు.ఆహా ప్రేక్షకులనుండి ఈ షో కి విపరీతమైన రెస్పాన్స్ లభిస్తుండటంతో.
అల్లు అరవింద్ “ఆహా” ను ఇంకా ఎక్కువగా ప్రమోట్ చెయ్యడం మొదలు పెట్టాడు.

స్టార్ హీరోల్లో ఒక్కడు అయిన తన కొడుకు “అల్లు అర్జున్” ను రంగంలోకి దింపాడు.కొన్ని రోజుల కిందట “ఆహా” లో “సామ్ జామ్” టాక్ షో కి అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చినట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి.అల్లు అర్జున్ తో షో కోసం అన్నపూర్ణ స్టూడియో లో ఆహా టీమ్ ప్రత్యేకమైన సెట్ ను వేశారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం మరియు ప్రేక్షకులకోసం గిఫ్ట్ గా న్యూ ఇయర్ రోజున జనవరి 1st 2021 నాడు ఆహాలో అల్లు అర్జున్ తో సమంత చేసిన సామ్ జామ్ టాక్ షో ఎపిసోడ్ ను ప్రసారం చెయ్యనున్నారు.ఆ విషయం ను సామ్ జామ్ టీమ్ తమ అదికారిక ట్విటర్ ద్వారా తెలియజేశారు.
మరో రెండు మూడు రోజుల్లో ప్రోమో కూడా విడుదల అవ్వునున్నది.
మెగాస్టార్ చిరంజీవి కూడా సామ్ జామ్ షో కి గెస్ట్ గా వచ్చినట్లు సోషల్ మీడియాలో రెండు రోజుల క్రిందటనే ప్రోమోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఆ షోను ఆహా లో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న అనగా రేపు ఆ షో ఆహాలో స్ట్రీమింగ్ అవ్వుతుంది.ఇక బన్నీ సినిమా విషయానికి వస్తే “అల వైకుంటపురంలో” చిత్రం విజయం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే చిత్రంలో నటిస్తున్నాడు.
గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది.అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది.
ఈ చిత్రంలో బన్నీ పుష్పా రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు
.