సాధారణంగా ఒక సినిమా సక్సెస్ అయితేనే ఆ సినిమా లో నటించిన హీరో కు లేదా హీరోయిన్ కు పారితోషికం భారీ గా పెరుగుతుంది.అలాంటిది అల్లు అర్జున్ ( Allu Arjun )పుష్ప సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
అంతే కాకుండా రికార్డు స్థాయి లో అవార్డు లను సొంతం చేసుకున్నాడు.ముఖ్యంగా పుష్ప సినిమా లో అల్లు అర్జున్ నటనకు జాతీయ అవార్డు ( National Award )లభించింది.
జాతీయ అవార్డు రాక తో అల్లు అర్జున్ బాధ్యత మరింత పెరిగినట్లు అయిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పుష్ప 2 సినిమా తో కూడా బన్నీ మరో సారి సందడి చేయడం ఖాయం అంటూ అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు.
ఆకట్టుకునే మంచి కథ తో సుకుమార్ పుష్ప 2 ని రూపొందిస్తున్నారు.

ఇప్పటికే పుష్ప సినిమా( Pushpa movie ) కు బన్నీ కమిట్ అయిన సమయం లోనే పుష్ప 2 సినిమా యొక్క పారితోషికం డిసైడ్ అయి ఉంటుంది.అంతే కాకుండా లాభా ల్లో వాటాగా తీసుకోబోతున్న బన్నీ ముందు ముందు పారితోషికం ను భారీ ఎత్తున పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తదుపరి సినిమాకు గాను ఏ ఇండియన్ సినీ నటుడు పారితోషికంను అందుకోబోతున్నాడట.
ప్రముఖ నిర్మాణ సంస్థ ఒకటి ఇప్పటికే బన్నీ కి ఇష్టమైనంత పారితోషికం ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.అంతే కాకుండా హిందీ లో కూడా ఒక నిర్మాత సంప్రదించారని తెలుస్తోంది.
ప్రస్తుతానికి పుష్ప 2 తప్ప మరే ఉద్దేశ్యం తో తాను లేను అన్నట్లుగా బన్నీ వారికి చెప్పాడు.రూ.125 కోట్ల నుండి రూ.150 కోట్ల పారితోషికం ఇవ్వాలని నిర్ణయించారు.బన్నీ ఈ రేంజ్ లో పారితోషికం తీసుకుంటూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఉంటే ఆయన అభిమానులకు ఫుల్ హ్యాపీ అయి ఉంటుంది.







