పుష్ప అప్‌డేట్‌ వచ్చింది... ఆర్ఆర్‌ఆర్‌ 'దోస్తీ' తరహాలో దేవిశ్రీ కూడా!

అల్లు అర్జున్‌.సుకుమార్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే విడుదల అయిన పుష్ప లుక్ ను బట్టి అర్థం అవుతోంది.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు.

భారీ పాన్ ఇండియా సినిమాగా పుష్పను రూపొందిస్తున్నారు.సినిమా లో మొదటి పాటను ఆగస్టు 13 విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

ఇటీవల దోస్తీ పాట ఎలా అయితే అయిదుగురు ప్రముఖ సింగర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిందో అలాగే పుష్ప లోని మొదటి పాట కూడా చాలా పవర్ ఫుల్‌ గా మాస్ బీట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న పుష్ప నుండి మొదటి పాట అప్డేట్‌ రావడంతో అభిమానులు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.

Advertisement

సుకుమార్‌ మరియు దేవి శ్రీ ప్రసాద్‌ ల కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ముఖ్యంగా మ్యూజికల్‌ హిట్‌ గా ఈ సినిమా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.ప్రతి ఒక్క పార్ట్‌ కూడా ఈ సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంటుంది అంటూ నమ్మకంతో అంతా ఉన్నారు.

సినిమాలోని ప్రతి పాట కూడా సినిమా స్థాయిని పెంచుతుందని.తప్పకుండా మరో రేంజ్‌ లో ఈ పాటలు ఉంటాయి అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు.అదుకు తగ్గట్లే పుష్ప నుండి రాబోతున్న మొదటి పాట ఊర మాస్ అన్నట్లుగా ఉంటుందని తేలిపోయింది.

ఖచ్చితంగా పుష్ప సినిమా షూటింగ్‌ ను మొదలు పెట్టడం మొదలు ముగించే వరకు ఉన్న అంచనాలు మోసే విధంగానే సినిమా ఉంటుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.దాక్కో దాక్కో మేక అనే పాట మరో లెవల్‌ లో ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు