ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా (Pushpa 2)ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ హీరో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇలా పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైనటువంటి ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ చిత్రం షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15 సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన సంచలనాలను అందుకోవడంతో ఈ సినిమాపై కూడా భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి.
పుష్ప 2 సినిమా( Pushpa 2 ) నుంచి ఇప్పటికే విడుదల చేసినటువంటి పోస్టర్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి.అయితే ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పుష్ప సినిమా ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు మించి పుష్ప2 క్లైమాక్స్ ఉండబోతుందని తెలుస్తోంది.పుష్ప 2 తోనే కథ ముగించాలని సుకుమార్ అనుకున్నా సినిమాకు మరో భాగం పుష్ప 3 ( Pushpa 3 ) కూడా చేసే ఆలోచనలో ఉన్నారట.
పుష్ప రాజ్ ( Pushparaj )కథను పుష్ప 2 తో ఎండ్ చేసినా పుష్ప 3 మరో కొత్త కథను చెబుతాడని తెలుస్తుంది.
ఇలా ఈ సినిమా సీక్వెల్ చిత్రానికి కూడా కొనసాగింపుగా మరొక పార్ట్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి నిజంగానే పుష్ప3 కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఇక ఈ సినిమాలో భారీ యాక్షన్స్ సన్ని వేషాలు కూడా ఉండబోతున్నాయని ఈ సినిమా క్లైమాక్స్ అంచనాలను మించి ఉండబోతుందని తెలుస్తోంది.
పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయి( Pan Indian Star )లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని నేషనల్ అవార్డు కూడా గెలుపొందినటువంటి అల్లు అర్జున్ ఈ సినిమా ద్వారా సరికొత్త సంచలనాలను సృష్టించబోతున్నారని తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy