అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో ప్రస్తుతం పుష్ప 2 సినిమా చిత్రీకరణ జరుగుతుంది.2021 సంవత్సరం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.అందుకే సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.దాదాపు సంవత్సర కాలం పాటు ఈ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ జరిగింది.
దర్శకుడు సుకుమార్ ఎక్కడ లోటు పాట్లు లేకుండా అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేశాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకు షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది.
ఆ తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని మొదలు పెట్టేందుకు డేట్లు ఇచ్చేసినట్లుగా సమాచారం అందుతుంది.

అల్లు అర్జున్ తదుపరి సినిమా ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో చేయబోతున్నట్లుగా దాదాపుగా కన్ఫర్మ్ అయింది.వీరిద్దరి కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మరియు అలవైకుంటపురంలో సినిమాలు వచ్చి భారీ విజయాలను నమోదు చేసిన విషయం తెలిసిందే.కనుక మరో సారి వీళ్ళిద్దరి కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు.
కచ్చితంగా భారీ విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఉండే విధంగా భారీ సినిమా ను ప్లాన్ చేస్తున్నారట.

అతి త్వరలోనే మహేష్ బాబు తో త్రివిక్రమ్ రూపొందిస్తున్న సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది.కనుక అల్లు అర్జున్ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.పుష్ప సినిమా విడుదల కాక ముందే అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వబోతుందట.
వీరిద్దరి కాంబినేషన్ సినిమా ను 2024 సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.







