సాధారణంగా వేసవికాలం మొదటి రెండు పెద్దగా ఎండలు వుండవు.కానీ ఈ సంవత్సరం మొదటి నెలనుండే భానుడు తన రుద్ర ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
పగటిపూట ఇక ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవడంతో సహజంగానే మనకి దాహంతో పెదవులు తడారుతున్నాయి.అలాంటిది వన్యప్రాణులు అయినటువంటి జంతువులు, పక్షులు సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదు.
వేసవి తాపంతో అవి చుక్క నీటి కోసం అల్లాడుతుంటాయి.ఒకప్పుడు వాటికి ఆ బాధ ఉండేది కాదు.
ఎందుకంటే ఎక్కడిపడితే అక్కడ చెరువులు, బావులు, సరస్సులు అనేవి వుండేవి.కానీ నేడు పరిస్థితి మారింది.

మనిషి తన స్వార్థంకోసం అడవులను నరికేస్తున్నాడు.తత్ఫలితంగా వర్షాలు పడక నేల బీడుభూమిగా తయారవుతోంది.చెరువులు ఇంకిపోతున్నాయి, సరస్సులు నీరుగారిపోతున్నాయి.ఇక బావుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు.కొత్తగా బావులు తవ్వట్లేదు సరికదా… ఆల్రెడీ వున్న పాత బావులను పూడ్చేస్తున్నారు.ఇలాంటి స్వార్ధపూరిత ప్రపంచంలో కూడా మంచివారు ఎక్కడో ఒకచోట వుంటారు అని నిరూపించాడు ఓ సైక్లిస్ట్.

అవును, అతగాడు పిచ్చుక దాహం తీర్చిన వీడియో నెటిజన్లను చాలా తీవ్రంగా ఆకట్టుకుంటోంది.ఐఎఫ్ఎస్ అధికారి అయినటువంటి సుశాంత నందా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ అందమైన దృశ్యం వెలుగు చూసింది.ఈ వీడియోలో పక్షి ముందు సైక్లిస్ట్ వాటర్ బాటిల్‌లోని నీటిని మూతలో పోసి ఉంచడం కనిపిస్తుంది.‘గొప్ప సంకల్పం కంటే చిన్నపాటి దయాగుణం గొప్ప!’ అని ఆ వీడియోకి క్యాప్షన్ ఇవ్వడం విశేషం.పక్షుల కోసం బయట కొంత నీరును అందుబాటులో ఉంచండని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.సుశాంత నందతో ఏకీభవించిన నెటిజన్లు సైక్లిస్ట్ ఔదార్యంపై ప్రశంసలు గుప్పించారు.వేసవి ముంచుకొస్తోంది.దయచేసి అందరూ ఇలా దయతో వ్యవహరించండని ఓ యూజర్ కామెంట్ చేశారు.







