స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు ఎగబడ్డారు.
ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది.
ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నాన్-బాహుబలి రికార్డులు క్రియేట్ చేసింది.కాగా ఈ సినిమాతో బన్నీ-త్రివిక్రమ్‌లు హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు.
దీంతో ఈ కాంబోను మరోసారి రిపీట్ చేయాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.దీనికి సంబంధించి త్రివిక్రమ్‌ను సంప్రదించగా ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
కానీ బన్నీకి ఉన్న కమిట్‌మెంట్ల కారణంగా ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం లేదని అంటున్నారు.
ఏదేమైనా మరో రెండేళ్ల వరకు బన్నీ డైరీ ఫుల్ కావడంతో త్రివిక్రమ్‌తో సినిమా చేయాలంటే రెండేళ్లు ఆగాల్సిందేనని తెలుస్తోంది.
మరి అప్పటివరకు బన్నీ ఎన్ని హిట్లు కొడతాడో చూడాలి.ఇక త్రివిక్రమ్ కూడా ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.