టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో అల్లు ఫ్యామిలీ( Allu Family ) ఒకటే అల్లు రామలింగయ్య ఇండస్ట్రీలో నటుడిగా కమెడియన్గా కొనసాగుతూ ఉండేవారు.ఇక ఈయన వారసుడిగా అల్లు అరవింద్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్నారు.
ప్రస్తుత అల్లు అరవింద్ వారసుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఇండస్ట్రీలో ఎంతోమంది సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.గంగోత్రి సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి అల్లు అర్జున్ అనంతరం ఆర్య వంటి సూపర్ హిట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood Industry )లో నటుడిగా మంచి సక్సెస్ అయినటువంటి ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇక అల్లు అర్జున్ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఇక అల్లు అర్జున్ స్నేహారెడ్డి( Sneha Reddy ) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు ఇద్దరు సంతానం అనే సంగతి తెలిసిందే.ఇక అల్లు అర్జున్ ముద్దుల కుమార్తె అర్హ( Arha ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇంత చిన్న వయసులోనే ఎంతో టాలెంట్ కలిగి ఉన్నటువంటి ఈ చిన్నారి ఇప్పటికే బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సందడి చేశారు.
అంతేకాకుండా అర్హకు సంబంధించిన ఎన్నో విషయాలను అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ఇద్దరు సోషల్ మీడియా( Social Media )లో షేర్ చేస్తూ ఉంటారు.ఇలా ఈ చిన్నారికి ఇంత చిన్న వయసులోనే విపరీతమైనటువంటి ఫాన్ ఫాలోయింగ్ ఉంది అనే సంగతి మనకు తెలిసిందే.
అల్లు అర్హ చదువులో మాత్రమే కాకుండా నటనలోనూ అలాగే చెస్ ఆడటంలో కూడా ఎంతో ప్రావీణ్యురాలు అనే విషయాన్ని ఇదివరకు అల్లు అర్జున్ వెల్లడించారు అయితే ఈమెలో మరో టాలెంట్ కూడా దాగి ఉందని తెలుస్తుంది.

అల్లు అర్హ చాలా అద్భుతంగా మట్టితో బొమ్మలను( Clay Dolls ) తయారు చేస్తారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈమె మట్టితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు ఇందుకు సంబంధించినటువంటి ఫోటోని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇలా అర్హత తయారు చేసినటువంటి ఈ వినాయకుడి విగ్రహానికి సంబంధించిన ఫోటోని ఈయన తన ఇంస్టాగ్రామ్ స్టోరీ( Instagram Story ) ద్వారా షేర్ చేస్తూ అర్హ చేశారని చెప్పుకువచ్చారు.
ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అర్హత చూసి అభిమానులు ఫీదా అవుతున్నారు.