ఆ విషయంలో బన్నీ ఫుల్ క్లారిటీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఆగస్టు 13న రిలీజ్‌కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాలో బన్నీ ఊరమాస్ లుక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతోంది.

 Allu Arjun Koratala Siva Movie Fixes Release Date, Allu Arjun, Koratala Siva, Pu-TeluguStop.com

ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన నెక్ట్స్ చిత్రాన్ని అనౌన్స్ చేసిన బన్నీ, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమాను కొరటాల తనదైన కథనంతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో బన్నీని మునుపెన్నడూ చూడని విధంగా ప్రెజెంట్ చేసేందుకు కొరటాల ప్లాన్ చేస్తున్నాడట.అయితే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే, రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను ఏ సమయంలో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారో ఆ డేట్‌ను బన్నీతో కలిసి కొరటాల ఫిక్స్ చేశాడట.దీనికి సంబంధించిన ప్రకటన కూడా త్వరలోనే ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి కొరటాలతో తెరకెక్కించబోయే సినిమాను బన్నీ ఎప్పుడు రిలీజ్ చేయాలో ఫుల్ క్లారిటీతో ఉన్నాడని, అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాలో బన్నీ పాత్ర ఎలా ఉంటుందా, ఈ సినిమాలో మిగతా నటీనటులు ఎవరా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

కాగా పుష్ప చిత్రాన్ని ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న బన్నీ, ఈ సినిమాతో తన సక్సెస్‌ను కంటిన్యూ చేయాలని గట్టిగా చూస్తున్నాడు.ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube