టాలీవుడ్ టాప్ 3 స్టార్ హీరోలు ఎవరు అనగానే ఠక్కున వినిపించే పేర్లలో అల్లు అర్జున్ పేరు ఉండక పోవచ్చు.కాని ఒక విషయంలో మాత్రం ఆ టాప్ స్టార్ హీరోల కంటే కూడా అల్లు అర్జున్ తోపు అంటూ పదే పదే నిరూపితం అవుతుంది.
కేరళలో అల్లు అర్జున్ సాధిస్తున్న వసూళ్ల ముందు ఇతర ఏ స్టార్ హీరో కూడా నిలువలేక పోతున్నారు.కేరళలో అక్కడి స్టార్ హీరోల స్థాయిలో వసూళ్లను రాబట్టగల సత్తా ఉన్న ఏకైక తెలుగు హీరో అల్లు అర్జున్ అంటూ ప్రతి ఒక్కరు చెప్పగలరు.
అల్లు అర్జున్ తాజా చిత్రం ‘అల వైకుంఠపురంలో’ విడుదలకు సిద్దం అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రంకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు.అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న కేరళలో అల వైకుంఠపురంలో సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ముఖ్యంగా విడుదలైన మొదటి రోజు తెల్లవారు జామున షోలు వేయబోతున్నారు.
దాదాపు 35 నుండి 40 థియేటర్లలో ప్రత్యేక షోలను వేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నారు.

కేవలం మలయాళ హీరోలకు మాత్రమే అది కూడా స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యం అయ్యే ప్రత్యేక షోలను అల్లు అర్జున్ సినిమాకు వేయడంతో ఆయన స్థాయి ఏంటో తెలిసి పోతుంది.అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకోవడం ఖాయం అంటూ చాలా నమ్మకంగా ఫ్యాన్స్ ఉన్నారు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం కేరళలో కూడా బన్నీ గత రికార్డులను బ్రేక్ చేస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
అందుకే కేరళలో బన్నీ రికార్డులను మరెవ్వరు దక్కించుకోలేరు కనుక టాలీవుడ్ హీరోల్లో బన్నీనే తోపు హీరో అంటూ ఆయన అభిమానులు చెబుతున్నారు.