ఐకాన్ ఇక లేనట్టేనా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Allu Arjun Icon Movie Shelved Forever-TeluguStop.com

ఇక ఈ సినిమాను ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమా పూర్తిగాక ముందే బన్నీ తన నెక్ట్స్ మూవీని గతంలోనే అనౌన్స్ చేశాడు.

దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేశాడు.ఈ సినిమాకు ఐకాన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.

 Allu Arjun Icon Movie Shelved Forever-ఐకాన్ ఇక లేనట్టేనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వేణు శ్రీరామ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ చిత్రం తెరకెక్కిస్తుండటంతో ఐకాన్ చిత్రాన్ని పక్కనబెట్టాడు.కాగా ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రం రిలీజ్‌కు రెడీ కావడంతో, వేణు శ్రీరామ్ ఐకాన్ చిత్రంపై ఫోకస్ పెడతాడని అందరూ అనుకున్నారు.

కానీ ఐకాన్ చిత్రం ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు.ఇప్పటికే బన్నీ పుష్ప చిత్రంతో బిజీగా ఉండగా, ఆ తరువాత కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు.

ఈ సినిమా పూర్తయ్యేందుకు మరో ఏడాది పడుతుంది.

ఈ లెక్కన వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో ఐకాన్ చిత్రం ఇక అటకెక్కినట్లే అని చిత్ర వర్గాలు అంటున్నాయి.

మరి స్టార్ ప్రొడ్యూ్సర్ దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌పై ఎలా స్పందిస్తాడా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.ఇక పుష్ప చిత్రంలో బన్నీ పుష్పరాజ్ అనే పాత్రలో నటిస్తుండగా, ఈ పాత్రకు సంబంధించిన టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ నటుడు ఫాహద్ ఫసిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూసర్ చేస్తున్నారు.

#Icon #Venu Sriram #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు