ఆనంద్ దేవరకొండ,( Anand Devarakonda, ) విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ”బేబీ”.( Baby movie ) ఈ మూవీ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.
ఎందుకంటే ఇది లవ్ స్టోరీ కావడం హీరోయిన్ బోల్డ్ రోల్ కావడంతో ఈ సినిమా కుర్రాళ్లకు మరింతగా నచ్చేసింది.ఈ సినిమా ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకోగా ఇప్పుడు మరింత మంచి టాక్ తో దూసుకు పోతుంది.
ఇక ఈ సినిమాను కలర్ ఫోటో లాంటి అందమైన సినిమాకు కథ ఇచ్చిన ప్రముఖ రచయిత దర్శకుడు సాయి రాజేష్ ( Sai Rajesh )తెరకెక్కించాడు.జులై 14న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీగా నిలిచింది.ఇక ఈ సినిమాపై చాలా మంది ప్రముఖులు ఇప్పటికే ప్రశంసలు కురిపించారు.ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా బేబీ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
తాజాగా బేబీ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ కూడా పాల్గొన్నారు.మరి ఈ క్రమంలోనే ఈయన మాట్లాడుతూ టీమ్ మొత్తంపై ప్రశంసలు కురిపించారు.తనకు బేబీ సినిమా( Baby movie ) ఎంతగానో నచ్చింది అని ఆనంద్ తో పాటు వైష్ణవి కూడా తమ పాత్రల్లో అద్భుతంగా సహజమైన నటన కనబర్చి ఆకట్టుకున్నారు అని తెలిపాడు.అలాగే టీమ్ లోని ప్రతి ఒక్కరు బేబీ సినిమాకు ప్రాణం పెట్టి పని చేసారని.
నిర్మాత ఎస్ కే ఎం తనకు బాగా తెలుసనీ తామనిద్దరం ఆఖరి శ్వాస వరకు మెగాస్టార్ ఫ్యాన్స్ అంటూ తెలిపారు.అలాగే డైరెక్టర్ పై కూడా ప్రశంసలు కురిపించారు.
బిడ్డను కనడానికి తల్లి పడేంతటి కష్టాన్ని బేబీ సినిమా కోసం సాయి రాజేష్ పడ్డారని మొత్తంగా బేబీ సినిమాపై ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.