అల్లు అర్జున్( Allu Arjun ) అనగానే వారి అభిమానులకి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి స్టైలిష్ లుక్ మరియు విభిన్నమైన డ్రెస్ లు గుర్తుకొస్తాయి.కానీ ఈ మధ్య కాలంలో ఆయన ఎప్పుడు చూసినా పొడవాటి గడ్డం మరియు పొడుగ్గా ఉన్న జుట్టుతో కనిపిస్తున్నాడు.
అల్లు అర్జున్ ని మళ్ళీ సాధారణ లుక్ లో ఎప్పుడు చూస్తామా అంటూ అభిమానులు అంతా ఎదురు చూస్తున్నారు.ఆ మధ్య దసరా సినిమా( Dussehra movie ) కోసం నాని జుట్టు మరియు గడ్డం పెంచితే అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఎప్పుడు నాని గడ్డం మరియు జుట్టు తొలగించి నార్మల్ లుక్ కి వస్తాడా అంటూ అభిమానులు వెయిట్ చేశారు.ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు.
ప్రస్తుతం పుష్ప 2 ( Pushpa 2 )సినిమా చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే.ఆ సినిమా కోసం అల్లు అర్జున్ జుట్టు మరియు గడ్డం పెంచిన విషయం కూడా అందరికీ తెలుసు.
కనుక ఆ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత మాత్రమే అల్లు అర్జున్ నార్మల్ లుక్ వచ్చే అవకాశం ఉంది.

వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.కనుక అభిమానులు అల్లు అర్జున్ ని ప్రస్తుతం ఉన్న లుక్ లో మరో సంవత్సరం పాటు చూడాల్సిందే అంటూ ఆయన అభిమానులు సంఘం నాయకులు చెప్తున్నారు.అల్లు అర్జున్ ని దర్శకుడు సుకుమార్( Director Sukumar ) భారీ యాక్షన్ సినిమాలో చూపించబోతున్నారు.
పుష్ప ని మించి అల్లు అర్జున్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.

రూ.1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో రాబోతున్న పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ చాలానే కష్టపడుతున్నాడు.జుట్టు గడ్డం పెంచుకొని ఉండాలి అంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆ కష్టాన్ని దాదాపు రెండు సంవత్సరాలుగా అల్లు అర్జున్ పడుతూనే ఉన్నాడు.పుష్ప సినిమా కోసం కూడా అల్లు అర్జున్ ఇలాగే కనిపించిన విషయం తెలిసిందే.
అంతకు ముందు కూడా రెండు సంవత్సరాలుగా అల్లు అర్జున్ ఇదే లుక్ తో ఉన్నాడు.మొత్తంగా నాలుగు సంవత్సరాల పాటు అల్లు అర్జున్ ఇదే లుక్కుతో కనిపించాల్సిన పరిస్థితి వచ్చింది.
వచ్చే సంవత్సరం సమ్మర్ తర్వాత అల్లు అర్జున్ లుక్ మారే అవకాశం ఉంది.







