Allu Arjun : మామ గెలుపు కోసం ప్రచారం చేయబోతున్న బన్నీ.. బన్నీ ఎంట్రీతో ఆయన విజయం తథ్యమా?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్( Allu Arvind ) కుమారుడిగా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్( Allu Arjun ) పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

 Allu Arjun Election Campaign For His Father Inlaw Chandra Sekar Reddy Check-TeluguStop.com

ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే.

బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నారట.అలా ఎక్కడ నుంచి ఆయన పోటీ చేయట్లేదు.

కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

Telugu Allu Arjun, Alluarjun, Chandrashekar, Law, Tollywood-Movie

అయితే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నాడని తెలిసి అంతా షాక్ అవుతున్నారు.పొలిటికల్ ఎంట్రీ ( Political entry )కంటే కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడమే కాస్త విడ్డూరంగా ఫీల్ అవుతున్నారు.ఆయన ఏమైనా ఎంట్రీ ఇవ్వాలనుకుంటే తన మేనమామ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )పెట్టిన జనసేన పార్టీలో చేరాలి, లేదా ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే జనసేనకు చేయాలి.

ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనాలి.కానీ షాకింగ్ గా ఈయన కాంగ్రెస్ కు సపోర్ట్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకుందని తన మామయ్య కోసమే.అంటే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి కోసం బన్నీ ఈ డెసీషన్ తీసుకున్నారట.

Telugu Allu Arjun, Alluarjun, Chandrashekar, Law, Tollywood-Movie

స్నేహా రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ( Chandrasekhar Reddy )తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.కేవలం పార్టీలో చేరడం మాత్రమే కాదండోయ్.ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.ఆ ఆలోచన మనసులో ఉండడంతోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.ఈ విషయాల గురించి చర్చించినట్లు కూడా సమాచారం.

అయితే చంద్రశేఖర్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డి పోటీ చేసిన మాల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట.అదే విషయాన్ని రేవంత్ రెడ్డికి చెప్పగా సీటు నీకే కన్ఫార్మ్ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా మల్కాజిగిరి స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డియే పోటీ చేస్తారని ఆయనకు సీటు ఖరారైందని విస్తృతంగా ప్రచారం సాగుతోంది.ఇదే కనుక నిజం అయితే అల్లు అర్జున్ మామ తరఫున ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube