చీప్‌గా దాన్ని అల్లు అర్జున్‌ అడుక్కోవడం ఏంటీ?

మొన్న జరిగిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను తలదన్నేలా అల్లు అర్జున్‌ అల వైకుంఠపురంలో సినిమా మ్యూజికల్‌ నైట్‌ జరిగింది.

పేరుకు తగ్గట్లుగా మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేశాడు.

ఈ సందర్బంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు.తన తండ్రి గురించి తన కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

మొదటి సారి తన తండ్రికి కృతజ్ఞతలు చెబుతున్నాను అంటూ స్టేజ్‌ పై నుండి అల్లు అరవింద్‌కు బన్నీ కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఇదే సందర్బంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.నాన్న ఒక గొప్ప నిర్మాత అని, ఆయన ఒక మంచి సినిమా రివ్యూవర్‌ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.సినిమా ఇండస్ట్రీకి ఇంతటి సేవ చేసిన వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నాడు.

Advertisement

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అల్లు అరవింద్‌ పేరును పద్మశ్రీ అవార్డుకు సిఫార్సు చేయాలంటూ అల్లు అర్జున్‌ ఇండైరెక్ట్‌గా కోరడం జరిగింది.మరి ఈ విషయమై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా స్పందిస్తారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.

అల్లు అర్జున్‌ ఇలా వేదికపై తన తండ్రికి పద్మశ్రీ అవార్డు రావాలంటూ కోరడంపై కొందరు నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.అవార్డులు అనేవి ఇలా కోరుకుంటే రావని, ఎవరైనా సిఫార్సు చేయాలి, అందుకోసం చాలా పోరాటం చేయాలంటూ బన్నీ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.అల్లు అర్జున్‌ కాకుండా మరెవ్వరైనా మొదట అల్లు అరవింద్‌కు పద్మశ్రీ రావాల్సిందే అంటూ డిమాండ్‌ చేయాలి.

దాన్ని బన్నీ సమర్ధిస్తున్నట్లుగా మాట్లాడితే అప్పుడు బన్నీకి గౌరవం ఉండేది అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

క్రమం తప్పకుండా లిప్స్ స్టిక్ ఉపయోగిస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!

Advertisement

తాజా వార్తలు