బేబీ మూవీ టీం కోసం ప్రత్యేకంగా ఈవెంట్ ప్లాన్ చేసిన అల్లు అర్జున్!

ఆనంద్ దేవరకొండ ( Anand Deverakonda ), వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya ), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ప్రధాన పాత్రల్లో SKN నిర్మాణంలో సాయి రాజేష్ (Sai Rajesh) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బేబీ ( Baby ).ఈ సినిమా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

 Allu Arjun Has Planned A Special Event For The Baby , Allu Arjun, Appriciation E-TeluguStop.com

ఇక ఈ సినిమా రోజురోజుకు కలెక్షన్ లో భారీగా పెరిగిపోతూ ఇప్పటివరకు 40 కోట్ల కలెక్షన్లను సాధించింది.ఇలా ఊహించిన విధంగా ఒక చిన్న సినిమా ఇలాంటి విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఇప్పటికే సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.బేబీ సినిమా కోసం ఐకాన్ అల్లు అర్జున్( Allu Arjun ) ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందాన్ని అప్రిషియేట్ చేస్తూ ఐకాన్ స్టార్ అప్రిసియేషన్ ఈవెంట్ నిర్వహించబోతున్నారని తెలుస్తుంది.ఇక ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.

ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ నాగబాబు పాల్గొని సందడి చేశారు.అయితే అప్రిషియేషన్ ఈవెంట్ ( Appriciation Event )ను ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్లాన్ చేయడానికి కారణమేంటి అనే విషయానికి వస్తే.బేబీ సినిమాని నిర్మించిన SKN, మారుతి, ధీరజ్.వీళ్లంతా అల్లు అర్జున్ కి క్లోజ్ సర్కిల్ లో ఉండే వాళ్ళే.ఇలా వీరంతా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో వారిని అప్రిషియేట్ చేస్తూ బన్నీ ఈ పార్టీ అరేంజ్ చేశారని తెలుస్తుంది అయితే చాలా రోజుల తర్వాత ఇలాంటి ఓ కార్యక్రమంలో అల్లు అర్జున్ పాల్గొనబోతున్నారని తెలియడంతో ఆయన స్పీచ్ కోసం అలాగే తన సినిమా అప్డేట్ కోసం కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube