పుష్ప 2 కి సంజయ్ లీలా భన్సాలీకి సంబంధం ఏంట్రా బాబు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ముంబయ్ వెళ్లి సంజయ్ లీలా బన్సాలీ ని కలవడం జరిగింది.బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ అయిన సంజయ్ లీలా బన్సాలీ ని ఆయన ఇంటికి వెళ్లి అల్లు అర్జున్ కలవడంతో చర్చ తార స్థాయికి చేరింది.

 Allu Arjun And Sanjay Leela Bansali Meeting For Pushpa 2 Movie, Allu Arjun, Movi-TeluguStop.com

ఉన్నట్టుండి సంజయ్‌ లీలా బన్సాలీ ఇంట్లో అల్లు అర్జున్ కనిపించడానికి అసలు కారణం ఏంటి అంటూ ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు.ఈ సమయంలో అల్లు అర్జున్ మరియు మధ్య ఏం చర్చ జరిగి ఉంటుంది అంటూ టాలీవుడ్ బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

వారి ఇద్దరి కలయిక కు కారణం ఏమై ఉంటుంది అనేది ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.కానీ ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటూ ఎవరికి తోచిన కథనాలు వారు రాసేసుకుంటున్నారు.

ముఖ్యంగా కొందరు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ తదుపరి సినిమా పుష్ప 2 కు సంబంధించిన విషయమై చర్చించేందుకు కలిసి ఉంటున్నాడు అంటున్నారు.పుష్ప 2 సినిమా హిందీలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Telugu Allu Arjun, Pushpa, Sanjayleela-Movie

అందుకే పుష్ప సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను సంజయ్ లీలా బన్సాలీ వద్ద చర్చించారని వారు ఊహిస్తున్నారు.ఆయనకు కమర్షియల్ ఎలిమెంట్స్ విషయంలో… ముఖ్యంగా హిందీ ప్రేక్షకుల మైండ్ సెట్ బాగా తెలుసు కనుక ఆయనతో మార్పులు చేర్పులు చేసే పుష్ప 2 మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని అల్లు అర్జున్ భావించి ఆ పని చేశాడని అన్నారు.కానీ ఆ అభిప్రాయం పూర్తిగా అవాస్తవం అంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అసలు పుష్ప కి భన్సాలీ సంబంధమే లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఊహించేసుకుంటున్నారు కానీ అసలు విషయం ఏంటంటే బన్సాలీ తెరకెక్కించిన గంగూభాయ్‌ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.కనుక ఆ సినిమా సక్సెస్ నేపథ్యంలో అభినందనలు తెలియ చేయడానికి ముంబై వెళ్లిన అల్లు అర్జున్ ఆయన ఇంటికి కూడా వెళ్ళాడు అంటూ సమాచారం అందుతోంది.

అంతేతప్ప పుష్ప సినిమా కోసం సంజయ్ లీలా బన్సాలీ ని అల్లు అర్జున్ కలిశాడు అనేది నూటికి నూరుపాళ్ళు నిజం కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube