పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు సైన్ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.ఆయన నుండి ఇక పై సంవత్సరానికి రెండు మూడు సినిమాలు వస్తాయి అంటూ ఎంతో ఆనందించారు.
కానీ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు.పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల సినిమా షూటింగ్ లకు తక్కువ హాజరవుతున్నాడు.
దాంతో ఆయన ఒక్కో సినిమా ను రెండు మూడు నెలల్లోనే పూర్తి చేయాలని భావించిన కూడా ఆలస్యం అవుతున్నాయి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఇటీవలే విడుదలైంది.
ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ విషయంలో గందరగోళం నెలకొంది.అనేక సార్లు వాయిదా పడి ఎట్టకేలకు విడుదల కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
భీమ్లా నాయక్ సినిమా విడుదలైన వెంటనే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగులో జాయిన్ అవుతాడు అని ప్రతి ఒక్కరు అనుకున్నారు.కాని పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లలో మునిగిపోయారు.
దాంతో హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ ఆలస్యమైంది.జనసేన సభ పూర్తి అయ్యింది కనుక సరే ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొంటాడా అంటే అది కూడా జరగడం లేదు.
ఈ నెలలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగులో జాయిన్ అయ్యే అవకాశాలు లేవంటూ చిత్రం యూనిట్ సభ్యుల ద్వారా క్లారిటీ వచ్చింది.ఏప్రిల్ నెలలో హరిహర వీరమల్లు సినిమా తో పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతాడు అని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఈ చిత్రం షూటింగులో జాయిన్ అవుతాడో అంటూ దర్శకుడు క్రిష్ ఎంతో ఆసక్తిగా కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో ఏ ఎం రత్నం నిర్మిస్తుండగా స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.మొఘలాయిల కాలం నాటి కథతో ఈ సినిమా రూపొందుతుండగా పవన్ కళ్యాణ్ దొంగ పాత్రలో ఈ సినిమా లో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.







