అల్లు అర్జున్, బాలయ్య లలో బోయపాటి ఓటు ఎవరికి...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న బోయపాటి శీను ఆయన చేసిన సినిమాలతో ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకున్నాడు.

ఇప్పుడు ఆయన ఎవరితో సినిమా చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

ఒకవైపు బాలయ్య బాబు బోయపాటి శ్రీను తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నప్పటికీ, అల్లు అరవింద్( Allu Arvind ) తన బ్యానర్ లో సినిమా చేయాలంటూ బోయపాటిని కోరుతున్నాడు.

ఇక గీతా ఆర్ట్స్ లో సినిమా అంటే అది అల్లు అర్జున్ తోనే ఉంటుంది అని అందరూ ఫిక్స్ అయిపోయారు.మరి వీళ్ళిద్దరిలో బోయపాటి ఎవరికి ముందుగా ఓటు వేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అవ్వడంతో అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేయాలా వద్దా అనే డైలామాలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఎందుకంటే త్రివిక్రమ్ ఫ్లాప్ ల్లో ఉన్నాడు కాబట్టి ఆయన మార్కెట్ భారీగా డౌన్ అయింది.ఇక ఇలాంటి క్రమంలో త్రివిక్రమ్( Trivikram ) తో సినిమా చేసి ఇబ్బందులు పడడం ఎందుకు అని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

ఒక రకంగా బోయపాటి కూడా స్కంద సినిమాతో పెద్దగా ఆకట్టుకొనప్పటికి బోయపాటి మాస్ డైరెక్టర్ కాబట్టి ఇప్పుడు బన్నీ చేస్తున్న పుష్ప సినిమాతో ఆయన మాస్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.కాబట్టి మరోసారి మాస్ సినిమా చేస్తే బాలీవుడ్ లో కూడా విపరీతంగా క్రేజ్ వస్తుందనే ఉద్దేశ్యం తోనే అల్లు అర్జున్ బోయపాటి ని ప్రిఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక బాలయ్య బోయపాటి కాంబినేషన్ అఖండ సినిమా వచ్చినప్పటి నుంచే అఖండ 2( Akhanda 2 ) సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ అందరూ వెయిట్ చేస్తున్నారు.అయితే ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో అఖండ సీక్వెల్ వస్తుందా లేదంటే వేరే ఫ్రెష్ స్టోరీ తో సినిమా వస్తుందా అనేది తెలియదు.కానీ ఈ కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

మరి బాలయ్య బాబును కాదని బోయపాటి అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు