మహేష్ తో పోల్చితే అల్లు అర్జున్ డబుల్ స్పీడ్‌!

ఒకప్పుడు హీరోలు కేవలం సినిమా ల్లో నటించామా.వాటి ని అంతో ఇంతో ప్రమోట్ చేశామా.

 Allu Arjun Aaa Cinemas Going To Start Second Branch , Allu Arjun, Aaa Cinemas,-TeluguStop.com

మళ్లీ కొత్త సినిమాలు చేశామా అనుకునేవారు.కానీ ఇప్పుడు మాత్రం స్టార్‌ హీరోలు రకరకాలుగా బిజినెస్ లు చేస్తున్నారు.

ఒక వైపు సినిమా ల్లో నటిస్తూ మరో వైపు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్న హీరోలు చాలా మందే ఉన్నారు.అందులో మహేష్ బాబు( Mahesh babu ).అల్లు అర్జున్‌.విజయ్ దేవరకొండ.

ఇంకా కొందరు మల్టీప్లెక్స్ బిజినెస్‌ లో ఉన్నారు.వారు ఇప్పుడు తమ బిజినెస్ లో భారీ లాభాలు చూస్తున్న నేపథ్యం లో కొత్త బ్రాంచీలు మొదలు పెట్టే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

Telugu Aaa Cinemas, Allu Arjun, Amb Cinemas, Mahesh Babu, Pushpa-Movie

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ మధ్య కర్ణాటకలో మహేష్ బాబు తో కలిసి మరో ఏఎంబీ ( AMB cinemas )ని ఏషియన్ వారు ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.కానీ ఆ మల్టీ ప్లెక్స్ ఏర్పాటుకు చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యం లో మహేష్ బాబు కంటే ముందు అల్లు అర్జున్( Allu arjun ) తన ఏఏఏ మల్టీ ( AAA cinemas )ప్లెక్స్ బ్రాంచ్ ను జనాల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇటీవలే మొదటి ఏఏఏ మల్టీప్లెక్స్ ను మొదలు పెట్టిన బన్నీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో మల్టీ ప్లెక్స్ ను షురూ చేయడం జరిగిందట.

Telugu Aaa Cinemas, Allu Arjun, Amb Cinemas, Mahesh Babu, Pushpa-Movie

అది కూడా హైదరాబాద్ లోనే అవ్వడంతో సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మహేష్ బాబు చాలా రోజులుగా మరో మల్టీప్లెక్స్ అంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యం లో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.కానీ ఇప్పటి వరకు కనీసం పునాది రాయి పడ్డట్లుగా కూడా కనిపించడం లేదు.కానీ బన్నీ మాత్రం అప్పుడే రెండో మల్టీప్లెక్స్ పనులు షురూ చేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

అందుకే బన్నీ డబుల్ స్పీడ్‌ తో దూసుకు పోతున్నాడు అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube