రాహుల్ విజయ్,( Rahul Vijay ) శివాని రాజశేఖర్(Shivani Rajashekar) ప్రధాన పాత్రలలో నటిస్తున్నటువంటి చిత్రం కోట బొమ్మాళి పీఎస్’(Kota Bommali PS).తేజ మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఇక తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించగా అగ్ర నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఇక ఈ కార్యక్రమం అనంతరం మీడియా ప్రతినిధులతో చిత్ర బృందం ముచ్చటించారు.

ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు అల్లు అరవింద్ ను ప్రశ్నిస్తూ పలు విషయాలు వెల్లడించారు.గతంలో ఒక సందర్భంలో పెద్ద సినిమాలు రాకపోవడానికి కారణం ఏంటి అనే విషయం గురించి ఈయనని ప్రశ్నించగా సినిమా ఖర్చు పెరగటం కారణమంటూ చెప్పుకొచ్చారు.అయితే తాజాగా ఈయనకు ఈ విషయం గురించి మరో ప్రశ్న ఎదురవుతూ గతంలో సినిమా ఖర్చు పెరగటం వల్లే పెద్ద సినిమాలు రెగ్యులర్గా రాలేదని చెప్పారు అయితే సినిమాలకు ఖర్చు పెరగడం అంటే హీరోలా రెమ్యూనరేషన్ (Heros Remuneration) పెంచడం వల్ల ఖర్చు పెరిగిందా అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ఈయన ఆసక్తికరమైనటువంటి సమాధానం చెప్పారు.

సినిమా ఖర్చు( Production Cost ) పెరిగింది అంటే అందులో హీరోల రెమ్యూనరేషన్ పెరిగిందని అర్థం కాదు.పెరిగిన ఖర్చులలో హీరోలు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కేవలం 20 శాతం మాత్రమేనని ఈయన తెలియజేశారు.పెద్ద హీరోలు సినిమాలలో నటించడం వల్ల సినిమా ఖర్చులు పెరగడం లేదు.
ఎక్కువ ఖర్చు చేసి సినిమాలు చేస్తున్న వాటిలో స్టార్ హీరోలు( Star Heros ) నటిస్తున్నారని అందువల్లే సినిమా ఖర్చులు పెరుగుతున్నాయి అంటూ ఈయన తెలియజేశారు.ఒకప్పుడు ఒక సినిమా కేవలం ఒక భాషకు మాత్రమే పరిమితమయ్యేది అందువల్ల సినిమాకు కూడా తక్కువ ఖర్చు అయ్యేది కానీ ఇప్పుడు మాత్రం ఒక సినిమా అన్ని భాషలలో విడుదలవుతుంది సినిమా రేంజ్ పెరగడంతో ఖర్చులు కూడా పెరుగుతున్నాయి అంటూ ఈ సందర్భంగా ఈయన హీరోల రెమ్యూనరేషన్ ల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







